డీమెర్జర్ దిశగా ఎమ్మార్ ఎంజీఎఫ్
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ నుంచి దుబాయ్ సంస్థ వైదొలగనున్నట్లు సమాచారం. భవిష్యత్ వృద్ధి, విస్తరణ నిమిత్తం డీమెర్జర్ స్కీమ్ ద్వారా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నామని ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ బీఎస్ఈకి నివేదించింది. మరోవైపు ఈ జేవీ డీమెర్జర్ కోసం చర్యలు తీసుకోనున్నామని ఎమ్మార్ ప్రోపర్టీస్ కూడా దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్‌కు నివేదించింది. ప్రస్తుతమున్న ప్రాజెక్ట్‌లు, భూములు ఈ రెండు కంపెనీల మధ్య పంపకం జరుగుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాలపై ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
దుబాయ్‌కు చెందిన రియల్టీ సంస్థ ఎమ్మార్ ప్రోపర్టీస్, భారత్‌కు చెందిన ఎంజీఎఫ్ గ్రూప్‌లు పదకొండేళ్ల క్రితం ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో ఈ రెండు కంపెనీలకు చెరో 49% వాటా ఉండగా, మిగిలింది ఆర్థిక సంస్థల వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తై బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ఎమ్మార్ ప్రోపర్టీస్ 2005లో భారత రియల్టీలోని ఈ జేవీతో ప్రవేశించింది.