emdowment
-
అర్చకులకు 25 శాతం వేతనాల పెంపు
సాక్షి, అమరావతి : దేవాదాయ శాఖా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం వేతనాలు పెంచుతూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, బదిలీల మార్గదర్శకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల్లో సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించేలా విధానాలు రూపొందిస్తామన్నారు. సదావర్తి లాంటి దేవాలయాల భూములను కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎల్లవేళలా పాటుపడుతుందని.. ఎవరైనా దేవాలయ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని దేవాలయాల్లో ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను రద్దు చేసి కొత్త కమిటీలు నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. -
27న ఎండోమెంట్ ట్రిబ్యునల్
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టును ఈనెల 27 ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహిస్తామని ఆ శాఖ సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్యతిథిగా విచ్చేస్తారన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములు, అర్చకులు, అధికారుల సమస్యలపై విచారణ జరుగుతుందన్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలోని కక్షిదారులు హాజరై సమస్యలు కోర్టు దృష్టికి తేవాలని కోరారు.