చిరుద్యోగికి.. ఏదీ సం‘క్రాంతి’?
నెలలుగా అందని వేతన బకాయిలు
అప్పులఊబిలో అంగన్వాడీ, వయోజన
విద్య కో–ఆర్డినేటర్లు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు
చిరుద్యోగుల జీవితాలతో టీడీపీ సర్కారు చెలగాటమాడుతోంది. వచ్చే అరకొర వేతనాలనూ సక్రమంగా అందించక ముప్పుతిప్పలు పెడుతోంది. పండుగ దగ్గరపడుతున్నా పట్టించుకోవడంలేదు. కనీసం జీతాలు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా పోతోంది. పండుగను ఎలా నెట్టుకురావాలో తెలియక పలువురు తలలుపట్టుకుంటున్నారు.
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో సర్వశిక్షా అభియాన్ పథకం కింద 580 మందికిపైగా చిరుద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు లేవు. ఇంటికి వెళితే కుటుంబ నిర్వహణ బాధలు భరించలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలోనని ఉద్యోగులు ఆందోళనకు లోనవుతున్నారు.
కలెక్టర్ కరుణించేనా?
పండుగకు మూడు రోజులు మాత్రమే ఉంది. జీతాలు మంజూరవుతాయనే ఆశతో మిగతా 2వ పేజీలో u సర్వశిక్షాఅభియాన్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఒక్క నెల జీతంవస్తే తమ కుటుంబాన్ని నెట్టుకు రావచ్చని ఆశపడుతున్నారు. కలెక్టర్ జీతాల నివేదికలను పరిశీలించి ఆమోదిస్తే, ఆ నివేదికల అనంతరం జీతాల చెక్కును మళ్లీ కలెక్టర్‌కు సర్వశిక్షాఅభియాన్ అధికారులు పంపాలి. ఆ చెక్కును కలెక్టర్ పరిశీలించి సంతకం చేస్తే తర్వాత అధికారులు సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 12వ తేదీలోపు జరిగితే ఉద్యోగులకు సంక్రాంతి పండుగ. లేకుంటే పస్తులే.
రూ.1 కోటి 68 లక్షలు అవసరం
సర్వశిక్షా అభియాన్ పరిధిలో పీవో, సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్, ఏఎంవో, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ క్ల్లర్క్లు, ఇంజినీరింగ్ ఈఈ, ఏఈలు, మండల స్థాయిలో 576 మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి గత నవంబర్, డిసెంబర్ జీతాలు రాలేదు. ఇవి ఇవ్వాలంటే రూ.1 కోటి 68 లక్షలు అవసరమవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అంగన్వాడీలకు
మూడు నెలలుగా పస్తులే!
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడీ, మినీ అంగన్వాడీ, ఆయాలు సుమారు 4,500 మందికిపైగా ఉన్నారు. బడ్జెట్ లేకపోవడంతో వీరికి గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వేతనాలు ఇవ్వలేదు. ఒక్కో అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,000, మినీ, హెల్పర్లు ఒక్కొక్కరికీ రూ.4,500 ఇవ్వాల్సి ఉంది. సంక్రాంతికి కనీసం ఉప్పు, పప్పుకూడా కొనుక్కోలేక అల్లాడాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
ఒక్క నెల వేతనమైనా అందేనా?
అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు ఈనెల ఐదో తేదీ కంటితుడుపుగా ఒక నెల వేతనానికి సరిపడా బడ్జెట్ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సీడీపీవోలు ఆ ప్రక్రియే ప్రారంభించకపోవడంతో ఆ వేతనం కూడా పండక్కు అందేటట్లు కనిపిం