రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్ టెకీ భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించింది. కంపెనీ ఇయర్ ఎండ్ రివ్యూలో భాగంగా మొత్తం ఉద్యోగులలో 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. పలు ఐటీ, టెక్ కంపెనీల్లో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న పలువురు తమ అనుభవాలు, కథనాలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు కంపెనీకి సేవలందించిన ఇండియన్ టెకీ లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది. (అమెజాన్ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!)
మైక్రోసాఫ్ట్‌లో 21 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత సంస్థలో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడంపై ప్రశాంత్ కమాని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ తర్వాత మైక్రోసాఫ్ట్ మొదటి ఉద్యోగం. భయం, ఆందోళనతో ఉద్వేగభరితంగా విదేశానికి పయనం కావడం ఇప్పటికీ గుర్తుంది. కానీ తన జీవితం ఇలా మారిందా అని ఇంకా ఆశ్చర్య పోతున్నాను అని ఆయన అన్నారు. 21 సంవత్సరాల్లో ఎన్నో పాత్రల్లో, కంపెనీల్లో పని చేశాను. ఈ జర్నీ చాలా సంతృప్తికరంగా సాగింది. మైక్రోసాఫ్ట్‌లో పని చేయడం నిజంగా గిఫ్ట్‌గానే భావిస్తా అంటూ కమానీ పేర్కొన్నారు. (షావోమి 12 ప్రొపై భారీ తగ్గింపు, ఎక్కడంటే!)
మైక్రోసాప్ట్లో ఉద్యోగం చేస్తున్నప్పటి ఆ అపారమైన అనుభవాన్ని కేవలం సంవత్సరాలతో కొలవలేను. చాలా ప్రతిభావంతులైన, తెలివైన వారి మధ్య పని చేయడం అదృష్టం. వారి నుండి చాలా నేర్చుకున్నాను వారికి కృతజ్ఞుడనంటూ ఆయన రాసుకొచ్చారు. తన జీవితాన్ని అత్యంత అర్ధవంతమైన మార్గాల్లో ప్రభావితం చేసినందుకు మైక్రోసాఫ్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మరీ ముఖ్యంగా అన్ని సమయాల్లో తనకు అండగా నిల బడిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను చాలా సందర్బాల్లో కుటుంబంకోసం లేకపోయినా, వారు మాత్రం తన కోసం ఎల్లపుడూ నిలబడ్డారనీ, ఇపుడు ఈ కఠిన సమయంలో కూడా తనకెంతో సపోర్ట్‌గా ఉన్నారంటూ ఉద్వేగాన్ని ప్రకటించారు. చివరగా తన అనుభవానికి సూట్ అయ్యే ఉద్యోగం ఇవ్వాలనుకునేవారు తనను సంప్రదించాలని కోరారు. ఈ నోట్ ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో భావోద్వేగాన్ని నింపుతోంది.
కాగా కమానీ 1999లో సాఫ్ట్వేర్ డిజైన్ ఇంజనీర్‌గా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్‌ను ప్రారంభించి 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన 2015లో కంపెనీ నుంచి వైదొలిగారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్‌గా మళ్లీ చేరడానికి ముందు అమెజాన్‌లో రెండేళ్లు పనిచేశారట. అయితే మైక్రోసాప్ట్ తాజా లేఆఫ్స్‌లో కమానీ ఉద్యోగాన్ని కోల్పోయారు.