Employment Fiction
-
మార్చిలో 8.14 లక్షల మందికి ఉద్యోగాలు: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఉపాధి కల్పన మార్చిలో 8.14 లక్షలని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) పెరోల్ డేటా పేర్కొంది. ఫిబ్రవరి ఈ సంఖ్య 7.88 లక్షలుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి కల్పన 67.59 లక్షలని గణాంకాలు పేర్కొన్నాయి. -
ఐటీఐలలో ఐదు ట్రేడ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లలో డిమాండ్ లేని ట్రేడ్లను రద్దు చేయాలని కార్మిక, ఉపాధి కల్ప న శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో అడ్మిషన్లను పరిగణిస్తూ.. గత మూడేళ్లుగా అడ్మిషన్ల తీరును విశ్లేషించింది. ఇప్పటికే ఐదు ట్రేడ్లలో ప్రవేశాల్లేవు. ఆయా రంగాల్లో ఉపాధి కల్పన కూడా ఆశాజనకంగా లేకపోవడంతో వాటిని రద్దు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫౌండ్రీమన్, షీట్ మెటల్ వర్కర్, రేడియో అండ్ టీవీ మెకానిక్, వైర్‌మెన్, సెక్రెటేరియల్ ప్రాక్టీస్ ట్రేడ్లు రద్దు కానున్నాయి. రాష్ట్రంలో 290 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో 65 ప్రభుత్వ ఐటీఐలు కాగా, 235 ప్రైవేటు సంస్థ లు నిర్వహిస్తున్నాయి. వీటి పరిధిలో 50 వేల మంది వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రెండ్‌కు తగ్గ ట్రేడ్లు.. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి నిపుణులను తయారు చేసేలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అక్కడున్న పరిస్థితులు, ఉపాధి అవకాశాల ఆధారంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. దీంతో డిమాండ్ లేని వాటిని తొలగించి కొత్త ట్రేడ్ల చేర్పుపై ఉపాధి కల్పన, శిక్షణల విభాగం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న ఐటీఐలలో 32 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 13 ట్రేడ్లకు శిక్షణ కాలం ఏడాది కాగా, 18 ట్రేడ్లు రెండేళ్ల కాల పరిమితి కేటగిరీలో ఉన్నాయి. మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ ట్రేడ్ పూర్తికి మాత్రం మూడేళ్లు పడుతుంది. ప్రస్తుత ట్రేడ్లలో ఐదింటిలో ప్రవేశాల్లేవు. తొలగించిన స్థానంలో కొత్తగా ఐదు ట్రేడ్లు చేర్చే అంశంపై ఉపాధి కల్పన, శిక్షణ శాఖ అధ్యయనం చేస్తోంది. వచ్చే విద్యా ఏడాది నాటికి కొత్త ట్రేడ్ల చేర్పుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఐటీఐలలో కామన్ ట్రేడ్లు అమలు చేసే దానిపైనా అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రతి ఐటీఐని పరిశ్రమలతో అనుసంధానం చేసి, ఉపాధి అవకాశాలు పెంచే లా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. -
నాలుగేళ్లలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశీ లాజిస్టిక్స్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు రావొచ్చని మానవ వనరుల సంస్థ ‘టీమ్‌లీజ్’ అంచనా వేసింది. జీఎస్టీ అమలు, మౌలిక రంగంపై పెడుతున్న పెట్టుబడుల వంటివి ఉద్యోగాల సృష్టికి దోహదపడగలవని నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం.. ►రోడ్డు రవాణా, రైలు రవాణా, వేర్‌హౌసింగ్ (గిడ్డంగులు), జలమార్గాలు, వాయు రవాణా, ప్యాకేజింగ్, కొరియర్ సర్వీసులు అనే ఏడు సబ్–సెక్టార్లలో ఈ కొత్త ఉద్యోగాలు రావొచ్చు. దీంతో లాజిస్టిక్స్ రంగంలో ప్రస్తుతం 1.09 కోట్లుగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 2022 నాటికి 1.39 కోట్లకు పెరగొచ్చు. ►రోడ్డు రవాణాలో 18.9 లక్షల ఉద్యోగాలు, రైలు రవాణాలో 40,000 ఉద్యోగాలు, వాయు రవాణాలో 4,00,000 ఉద్యోగాలు, జలమార్గాల్లో 4,50,000 ఉద్యోగాలు రావొచ్చు. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, జీఎస్టీ అమలు వంటి పలు అంశాలు లాజిస్టిక్స్ రంగ వృద్ధికి కారణంగా నిలువనున్నాయి. ►లాజిస్టిక్స్ రంగంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కొన్ని కొత్త నైపుణ్యాలు అవసరం కావొచ్చు. అలాగే దిగువ స్థాయిలో పలు ఉద్యోగాల కోత జరగొచ్చు. -
పట్టాలెక్కని పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పథకం కింద ప్రభుత్వం కొన్ని ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెనుకబడిన మండలాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదు కావడం, ఎక్కువ నిరక్షరాస్యత, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ప్రసవాల శాతం.. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు, పౌష్టికాహారం సరిగా అందని ప్రాంతాలను గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేశారు. జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు: ప్రపంచ బ్యాంకు సహకారంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి పథకం (తెలంగాణ రూరల్ ఇన్‌క్లూసివ్ గ్రోత్ ప్రాజెక్ట్ –టీఆర్ఐజీపీ) పట్టాలెక్కడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లు కావొస్తున్న పురోగతి కన్పించడం లేదు. కోట్ల రూపాయలు కేటాయించినా ఇప్పటివరకు ఖర్చు చేయని దుస్థితి కన్పిస్తోంది. ఉపాధి కల్పనే ప్రధానాంశం.. పల్లె ప్రగతి కింద గుర్తించిన గ్రామాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం. గ్రామీణ ఉత్పత్తి రంగాలను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆసక్తిని బట్టి ఉపాధి కల్పించాలి. గేదెలు, గొర్రెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, స్వయం ఉపాధి పొందడం కోసం ఏర్పాటు చేసుకునే కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాల్సి ఉంది. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు రుణాలు అందించడం ప్రత్యేక అంశం. కేటాయింపులు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా తెలంగాణ పల్లె ప్రగతి పథకానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచ బ్యాంకు రూ.450 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లతో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థికవృద్ధి రేటును పెంచడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కొనసాగింది ఆరు నెలలే.. హైదరాబాద్ మినహా నాటి తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని 150 అత్యంత వెనుకబడిన మండలాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. అప్పటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టులో మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించారు. ఆరు నెలలపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. ఉన్నట్టుండి ఈ కార్యక్రమాల అమలును నిలుపుదల చేశారు.లక్ష్యం పెద్దదే.. అయినా.. రూ.653 కోట్ల వ్యయంతో 150 మండలాల్లోని సుమారు 75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేపట్టిన ఈ పథకం అర్ధంతరంగానే ఆగిపోయింది. పల్లె ప్రగతితో తమ జీవితాలు మారిపోతాయని భావించిన వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం 150 తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎంపికైన మండలాలు రూ.653 కోట్లు స్వయం ఉపాధి కల్పనకు కేటాయించిన నిధులు.. రూ.203 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన నిధులు ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటుగా పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సౌకర్యం స్థానికంగానే కల్పిస్తారు. ఈ పథకంలో మంచి అంశాలను చేర్చినా అమలులో జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నా ఏ కారణాల వల్ల నిలిపివేశారో తెలియడం లేదు. ఈ పథకంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
ఉపాధికి ఊతం.. బిగ్ డేటా
♦ చిన్న వ్యాపారుల రుణ లభ్యతకు కీలకం ♦ తద్వారా ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ♦ నందన్ నీలేకని బెంగళూరు: ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిపరమైన సమస్యలకు బిగ్ డేటానే పరిష్కారమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చెప్పారు. ఇప్పటిదాకా రుణాలు సరిగ్గా దొరకక ఇబ్బంది పడుతున్న చిన్న వ్యాపారాలకు కూడా దీంతో తోడ్పాటు లభించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. ‘బిగ్ డేటా అనేది ఏదో అర్థం కాని సాంకేతిక పదమో, గిమ్మిక్కో కాదు. ఇది వాస్తవానికి దేశంలోని చిన్న వ్యాపార సంస్థల పెట్టుబడి ప్రక్రియకు, వృద్ధికి తోడ్పడుతోంది. ఇవి అంతిమంగా ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడతాయి‘ అని ఆయన చెప్పారు. వస్తు, సేవల పన్నుల విధానం జీఎస్టీ అమల్లోకి రావడంతో వ్యాపార సంస్థలకు సంబంధించిన కీలక గణాంకాలు అందుబాటులోకి వస్తున్నాయని నీలేకని తెలిపారు. ‘జీఎస్టీ పరిధిలోని దాదాపు ఎనభై లక్షల పైగా చిన్న వ్యాపార సంస్థలకు క్రమంగా రుణాలు లభించడం మొదలవుతుంది. ఆయా వ్యాపార సంస్థలు.. రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చాక మరింత వృద్ధి చెందుతాయి.. తదనుగుణంగా ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది‘ అని చెప్పారు. వ్యాపారాల పనితీరుకు సంబంధించి సరైన డేటా లేకనే చిన్న వ్యాపార సంస్థలకు రుణాలు లభించడం కష్టమవుతోందని నీలేకని చెప్పారు. మరోవైపు, మొండి బాకీల అంశంపై స్పందిస్తూ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలోని ఆర్బీఐ ఈ సమస్య పరిష్కారానికి చెప్పుకోతగ్గ ప్రయత్నమే చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐఎం పరీక్ష రాయకపోవడం మంచిదైంది.. ఐఐఎం ప్రవేశ పరీక్ష రాయకపోవడం తన అదృష్టమని లేకపోతే.. తాను ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితో కలిసి పనిచేసే అవకాశం కోల్పోయి ఉండేవాడినని నీలేకని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ పరీక్ష రాసి ఉండి ఉంటే ప్రస్తుతం ఏ సబ్బుల కంపెనీలోనో మరో దాన్లోనో మేనేజరుగా స్థిరపడిపోయి ఉండేవాడినని ఆయన చమత్కరించారు. ‘ఐఐఎం ప్రవేశ పరీక్షను మిస్ కావడం నా అదృష్టం. అప్పట్లో నేను ఉద్యోగం వెదుకుతూ ఓ చిన్న కంపెనీకి వెళితే అక్కడ నారాయణ మూర్తి నాకు ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత మా అనుబంధం మరింత బలపడింది.. అదే ఇన్ఫోసిస్ ఆవిర్భావానికి దారి తీసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒకవేళ నేను గానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఇన్ఫీలో భాగమయ్యే వాణ్ని కాను. అదృష్టవశాత్తూ అంతకన్నా ముందుగానే నేను ఇన్ఫోసిస్‌లో చేరాను‘ అని నీలేకని చెప్పారు. ఐఐటీలో విద్యాభ్యాసం, అక్కడి పరిస్థితులు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందించాయని, నాయకుడిగా ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు.