employment information
-
ఉద్యోగ సమాచారం
యురేనియం కార్పొరేషన్లో ఫైర్ ఆఫీసర్లు వైఎస్సార్ కడప జిల్లాలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్టు పద్ధతిలో ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 20. వివరాలకు http://www.ucil.gov.in చూడొచ్చు. డీఐఐపీలో ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స డిపార్టమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్.. కాంట్రాక్టు పద్ధతిలో ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స (ఖాళీలు-263) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. వివరాలకు http://dipp.nic.in చూడొచ్చు. గెయిల్ ఇండియాలో స్పెషల్ రిక్రూట్మెంట్ గెయిల్ ఇండియా లిమిటెడ్.. సీనియర్ మేనేజర్ (ఖాళీలు-3), డిప్యూటీ మేనేజర్ (ఖాళీలు-4), సీనియర్ ఆఫీసర్ (ఖాళీలు-8), సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-2), జూనియర్ ఇంజనీర్ (ఖాళీలు-6) పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్సీఎల్) వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 12. వివరాలకు http://gailonline.com/finalsite/currentopening.html చూడొచ్చు. ‘మెగా’లో డిప్యూటీ జనరల్ మేనేజర్లు మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ ఫర్ గాంధీనగర్ అండ్ అహ్మదాబాద్ (మెగా).. వివిధ విభా గాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఖాళీలు-6), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఖాళీలు -2), మేనేజర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27. వివరాలకు www.gujarat metrorail.com చూడొచ్చు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లో వివిధ పోస్టులు అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా(ఎన్ఐఎఫ్).. వివిధ విభాగాల్లో ఫెలోస్/సీనియర్ ఫెలోస్ (ఖాళీలు-25), మేనేజర్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 35 ఏళ్లకు మించకూడ దు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6. వివరాలకు http://nif.org.in చూడొచ్చు. తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పొజిషన్లు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ (ఖాళీలు-10), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-18), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-27) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ద రఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 14. వివరాలకు http://cutn.ac.in చూడొచ్చు. పవర్ ఫైనాన్స కార్పొరేషన్లో ప్రొఫెషనల్స్ పవర్ ఫైనాన్స కార్పొరేషన్ లిమిటెడ్.. సీఎస్ఆర్ యూనిట్లో ఖాళీల భర్తీకి దరఖాస్త్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 9. మరిన్ని వివరాలకు అక్టోబర్ 24 ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడగలరు. వివరాలకు www.pfcindia.com చూడొచ్చు. సీఐఐఎల్‌లో రీసెర్చ పర్సన్లు మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్.. భారతావని ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. కన్సల్టెంట్ (ఖాళీలు-1), సీనియర్ రీసోర్స పర్సన్ (ఖాళీలు-3), జూనియర్ రీసోర్స పర్సన్ (ఖాళీలు-3), వీడియో ఎడిటర్ (ఖాళీలు-2), ఆర్టిస్ట్ (ఖాళీలు-2), వెబ్ డిజైనర్/ అడ్మినిస్ట్రేటర్ (ఖాళీలు-2), ఎడిటోరియల్ అసిస్టెంట్ (ఖాళీలు-2), వీడియోగ్రాఫర్ (ఖాళీలు-2), టెక్నీషియన్ (ఖాళీలు-2), క్లరికల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), అకౌంట్ అసిస్టెంట్ (ఖాళీలు-1), డేటా ఇన్పుట్ ఆపరేటర్ (ఖాళీలు-4), అటెండర్ (ఖాళీలు-1). దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 30. వివరాలకు www.ciil.org చూడొచ్చు. బెల్లో పబ్లికేషన్ ఆఫీసర్స బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. కాంట్రాక్టు పద్ధతిలో పబ్లికేషన్ ఆఫీసర్స పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 7. వయసు 25 ఏళ్లకు మించకూడదు. వివరాలకు www.belindia.com చూడొచ్చు. ఢిల్లీలోని వర్సిటీలో సీనియర్ రెసిడెంట్లు ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ /సీనియర్ డిమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 46. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26. వివరాలకు http://ucms.ac.in చూడొచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో వివిధ పోస్టులు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. వికలాంగుల కోటాలో టెక్నికల్ ఆఫీసర్/డి, సైంటిఫిక్ ఆఫీసర్/సి, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 84. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 16. వివరాలకు https://npcilcareers.co.in చూడొచ్చు. కొచ్చి మెట్రో రైల్లో ఆపరేటర్లు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్.. మెయింటనర్స (ఖాళీలు-68), ట్రైన్ ఆపరేటర్స/స్టేషన్ కంట్రోలర్స (ఖాళీలు-80), జూనియర్ ఇంజనీర్ (ఖాళీలు-22), సెక్షన్ ఇంజనీర్ (ఖాళీలు-18) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 21. వివరాలకు http://kochimetro.org చూడొచ్చు. రూర్కీ ఐఐటీలో సైంటిఫిక్ ఆఫీసర్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ.. సైంటిఫిక్ ఆఫీసర్స (ఖాళీలు-6), మెడికల్ ఆఫీసర్స (ఖాళీలు-5), అసిస్టెంట్ లైబ్రేరియన్ (ఖాళీలు- 1), అసిస్టెంట్ స్పోర్ట్స ఆఫీసర్ (ఖాళీలు-1), డిప్యూటీ లైబ్రేరియన్ (ఖాళీలు-1), లైబ్రేరియన్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకి చివరి తేదీ అక్టోబర్ 30. వివరాలకు www.iitr.ac.in చూడొచ్చు. -
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఇ-గవర్నెన్స్ అథారిటీలో డెరైక్టర్(ఖాళీలు-2), జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-9), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1); ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీలో వైస్‌ప్రెసిడెంట్ (ఖాళీలు-1), జనరల్ మేనేజర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-7), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు -1); స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీలో జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-2), మేనేజర్(ఖాళీలు-2), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1); ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీస్ (పీఎంఓ), ఐటీఈ అండ్ సీ శాఖలో మేనేజర్ (ఖాళీలు-4). దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 6. వివరాలకు www.ap.gov.in చూడొచ్చు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో స్పోర్ట్స పర్సన్స్ భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే.. స్పోర్ట్స పర్సన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 46. వివరాలు.. ఆక్వాటిక్స్ (మెన్) (ఖాళీలు-2), బాస్కెట్‌బాల్ (మెన్) (ఖాళీలు-4), ఫుట్‌బాల్ (ఉమెన్) (ఖాళీలు-4), హాకీ (మెన్) (ఖాళీలు-5), వాలీబాల్ (మెన్) (ఖాళీలు-4), వాలీబాల్ (ఉమెన్) (ఖాళీలు-4), వెయిట్ లిఫ్టింగ్ (మెన్) (ఖాళీలు-4), క్రికెట్ (మెన్) (ఖాళీలు-5), ఫుట్‌బాల్ (మెన్) (ఖాళీలు-6), టేబుల్ టెన్నిస్ (మెన్) (ఖాళీలు-1), బాక్సింగ్ (మెన్) (ఖాళీలు-2), అథ్లెటిక్స్ (మెన్) (ఖాళీలు-1), స్విమ్మింగ్ (మెన్) (ఖాళీలు- 1), బ్యాడ్మింటన్ (ఖాళీలు-3). వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 12. వివరాలకు www.eastcoastrail.indianrailways.gov.in చూడొచ్చు. జేఎన్టీబీజీఆర్ఐలో సైంటిస్టులు జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (జేఎన్టీబీజీఆర్ఐ).. వివిధ విభాగాల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 19. సైంటిస్ట్ ఆ, ఇ కేటగిరీ, లైబ్రేరియన్ పోస్టు లకు వయోపరిమితి 35 ఏళ్లు. సైంటిస్ట్ ఉ కేటగిరీ వయోపరిమితి 40 ఏళ్లు. దర ఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 15. వివరాలకు http://jntbgri.res.in చూడొచ్చు. ఐహెచ్ఎంసీటీలో అసిస్టెంట్ లెక్చరర్లు చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎంసీటీ).. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 7. వయసు 30 ఏళ్లకు మించకూడదు. వివరాలకు www.ihmchennai.org చూడొచ్చు. ఐసీఏఆర్‌లో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్).. కాంట్రాక్ట్ పద్ధతిలో రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ) (ఖాళీలు-1), జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి ఇంటర్వూలు నిర్వహించనుంది. ఆర్ఏకి వయోపరిమితి 35 ఏళ్లు కాగా జేఆర్ఎఫ్కి 30 ఏళ్లు. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 14. వివరాలకు www.icarneh.ernet.in చూడొచ్చు. మేనేజ్- హైదరాబాద్‌లో వివిధ పోస్టులు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్).. డెరైక్టర్ (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్) (ఖాళీలు-1), డెరైక్టర్ (మానిటరింగ్, ఎవల్యూషన్) (ఖాళీలు-1), అసిస్టెంట్ డెరైక్టర్ (అల్లాయిడ్ ఎక్స్టెన్షన్) (ఖాళీలు-1), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) (ఖాళీలు-1), మెస్ మేనేజర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 8. వివరాలకు www.manage.gov.in చూడొచ్చు. ఓఎన్జీసీలో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3, అసిస్టెంట్ టెక్నీషియన్లు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్-కరైకల్.. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్రీ) (ఖాళీలు-3), అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) (ఖాళీలు-8), అసిస్టెంట్ టెక్నీషియన్ (మెకానికల్) (ఖాళీలు-3), అసిస్టెంట్ టెక్నీషియన్ (ప్రొడక్షన్) (ఖాళీలు -5), సెక్యూరిటీ సూపర్ వైజర్ (ఖాళీలు-2), జూనియర్ అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) (ఖాళీలు-57), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (డీజిల్) (ఖాళీలు-5), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (ఫిట్టింగ్) (ఖాళీలు-3), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (వెల్డింగ్) (ఖాళీలు-5), జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్మెంట్) (ఖాళీలు-2), జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) (ఖాళీలు-2), జూనియర్ సెక్యూరిటీ సూపర్వైజర్ (ఖాళీలు-1), జూనియర్ మోటర్ వెహికల్ డ్రైవర్ (హెవీ/వించ్) (ఖాళీలు-6), జూనియర్ ఫైర్ మ్యాన్ (ఖాళీలు-7). వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 20. వివరాలకు www.ongcindia.com చూడొచ్చు. -
సామాజిక సైట్లతో కొలువు వేట ఫలించాలంటే!
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు... ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. ఇలాంటి సైట్లతో ఉపయోగం ఎంత ఉందో, అపాయం కూడా అంతే ఉంది. వీటిపై ప్రస్తుతం విసృ్తతమైన చర్చ జరుగుతోంది. అందుకే దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేటి ఉద్యోగార్థులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కొలువుల వేటలో సామాజిక అనుసంధాన సైట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగ సమాచారం ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తును తీసుకోవడం, ఇంటర్వ్యూను పూర్తిచేయడం వరకు ఈ సైట్ల ద్వారా జరుగుతున్నాయి. కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగుల కోసం సామాజిక సైట్ల ద్వారానే గాలిస్తున్నాయి. అందుకే అభ్యర్థులు కొలువు కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏం చేయాలో, ఏం చేయకూడదో అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆన్లైన్లో క్రియాశీలకంగా: మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆన్లైన్లో క్రియాశీలకంగా వ్యవహరించాలి. మీ అర్హతలు, నైపుణ్యాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కంపెనీలకు మీ గురించి తెలియడానికి ఆన్లైన్ ప్రొఫెల్ ఎంతగానో ఉపయోగపడుతుం ది. ఒకవేళ ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ ప్రొఫైల్ కెరీర్లో మీ ఎదుగుదలకు సాయపడుతుంది. పోస్టుల్లో నిర్లక్ష్యం వద్దు : ఆన్లైన్లో మీరు ఏదైనా అంశాన్ని పోస్టు చేస్తే దాన్ని చాలా మంది చదువుతారు. మీపై ఒక అంచనాకు వస్తారు. కాబట్టి మీరు పోస్టు చేసే ప్రతిదీ తప్పుల్లేకుండా ఉండేలా జాగ్రత్తపడండి. పోస్టు చేసేముందు క్షుణ్నంగా చదువుకోండి. అక్షర, అన్వయ, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోండి. పోస్టుల్లో తప్పులుంటే.. మీరు నిర్లక్ష్యమైన మనిషి అని ఇతరులు తుది నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మీకు అవకాశాలు సన్నగిల్లుతాయి. గూగుల్‌లో పేరు: అంతర్జాలంలో ఏదైనా సమాచారం కావాలంటే అందరూ వెంటనే చేసే పని.. గూగుల్ సెర్చ్‌లో వెతకడం. కంపెనీకి రెజ్యూమెను పంపడానికి ముందు గూగుల్‌లో మీ సమాచారాన్ని పొందుపర్చండి. మీ పేరు టైప్ చేయగానే మీకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షం కావాలి. రిక్రూటర్లు కూడా గూగుల్‌లో మీ వివరాలను, ఫోటోలను పరిశీలిస్తారు. అభ్యంతరకరమైన సమాచారం, ఫోటోలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. కనెక్ట్.. అందరితో వద్దు: ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తుంటాం. ఎక్కువ మందితో కనెక్ట్ అయితే నష్టమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ అవసరాలకు సరిపోయే వారితోనే కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. వారి అవసరం మీకు, మీ అవసరం వారికి ఉండాలి. అప్పుడే ఇద్దరికీ మేలు జరుగుతుంది. ట్విట్టర్‌తో జాగ్రత్త: ట్విట్టర్లో పోస్టు చేసే వ్యాఖ్యలు వివాదాలను సృష్టిస్తుండడం చూస్తూనే ఉన్నాం. రిక్రూటర్లు కొలువుల భర్తీకి ట్విట్టర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. కనుక మీరు ఏదైనా ట్వీట్ చేసేముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. సంస్థ గురించి, యాజమాన్యం గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయకండి. అభ్యర్థులు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. హాస్యం.. శ్రుతి మించొద్దు: అతి ఎప్పటికీ అనర్థమే. మీకు నవ్వు తెప్పించే విషయం మరొకరికి కోపం తెప్పించొచ్చు. రిక్రూటర్/ హైరింగ్ మేనేజర్ మహిళ అయితే.. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసభ్యకరమైన జోక్స్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టు చేయకండి. అలాగే కులం, మతం వంటివాటిపై కూడా జోక్స్ సృష్టించొద్దు. ఒకవేళ ఇలాంటివి మీకు ఇష్టమైతే వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం సంగతి తర్వాత.. వాటి నుంచి బయటపడడమే చాలా కష్టం. సామాజిక సైట్లను సరిగ్గా వాడుకోగలిగితే ఇష్టమైన ఉద్యోగం సులువుగా సంపాదించుకోవచ్చు.