‘భగీరథ’తో ఉపాధి కోల్పోతున్నాం
గజ్వేల్: మండల పరిధిలోని కోమటిబండ గుట్టపై ‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్ ఏర్పాటు చేయడంతో బండ తొలుచుకుని బతికే తాము ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో తమను ఆదుకోవాలని వడ్డెర కార్మికులు శనివారం పంప్‌హౌస్‌ను పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్‌రావును కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి వారికి ప్రత్యామ్నాయ గుట్టను ఉపాధి కోసం చూపాలంటూ ‘గడ’ ఓఎస్డీ హన్మంతరావును ఆదేశించారు.