empoyees
-
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి రెండు డీఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు. అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)కు జమ చేయనున్నారు. డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెజాన్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు
బెర్లిన్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో అమెజాన్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కార్మికుల భద్రత, హక్కులపై పోరాడేందుకు 48 గంటల పాటు జర్మనీలోని అన్ని కేంద్రాల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. అమెజాన్ సంస్థలోని పలువురు ఉద్యోగులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం అందించాల్సిన సంస్థ కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (‘అధ్యక్షుడిగా వైదొలగినా ట్రంప్‌ను వెంటాడతాం’ ) కరోనా కష్టకాలంలోనూ కంపెనీ తమ స్వప్రయోజనాలకు, లాభాపేక్షకు మాత్రమే ప్రాధ్యానం ఇస్తుందని తమ భద్రత గురించి ఆలోచించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 'గుడ్ అండ్ హెల్తీ వర్క్' అనే నినాదంతో 48 గంటల పాటు సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ సంఘం ప్రతినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు. జర్మనీలోని వివిధ కేంద్రాల్లో పనిచేస్తున్న దాదాపు 30-40 మందికి కరోనా సోకిందని, అయినా ఇప్పటివరకు వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణల్ని అమెజాన్ తోసిపుచ్చింది. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత దృష్ట్యా సంస్థ .. జూన్ నాటికి సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,227 కోట్లు) పెట్టుబడి పెట్టిందని ప్రకటించింది. ఇప్పటికే 21 మిలియన్ల గ్లవుజులు, 18 మిలియన్ల ఫేస్ మాస్కులు సహా 39 మిలయన్ల ఇతర భద్రతా పరికరాలను అందించామని జర్మనీ అమెజాన్ ప్రతినిధి అన్నారు. నిరాదార ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డపేరు తేవడం మంచిది కాదని పేర్కొన్నారు. కాగా 2013 నుంచి జర్మనీలో వేతనాలు పెంచాలంటూ ఉద్యోగులు తరుచూ సమ్మెలకు దిగుతున్నారు. (దోశ ఆకృతిలో కనిపిస్తున్న గ్రహం ) -
కార్మికులకు వైద్యసేవలందించని ఈఎస్ఐ ఆసుపత్రులు
కార్మిక రాజ్య భీమాసంస్థ (ఈఎస్ఐ) గుట్టు చప్పుడు కాకుండా కార్మిక కుటుంబాలను అధోగతిపాలు చేసిం ది. ఈఎస్ఐ కార్డుదారుల కుటుంబసభ్యులకు వైద్యం అందించడంలో మొహంచాటేసే ప్రక్రియను చేపట్టింది. చింతాసే మోక్ష అనే నినాదాన్ని ఈఎస్ఐ బుట్టదాఖలు చేసింది. మామూలు జబ్బులకు చికిత్స అందిస్తున్నప్ప టికీ పుట్టుకతో సంభవించే దీర్ఘకాలిక జబ్బులు, జన్యు పరంగా సంభవించే జబ్బులకు ఇకపై వైద్యం అందిం చలేమని గత అక్టోబర్‌లో ‘ఆపరేషనల్ మాన్యువల్ -2014 సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్’ పేరుతో ఓ సర్క్యులర్లను ఈఎస్ఐ సంస్థ జారీచేసింది. ఈ మాన్యువల్‌లోని ‘హై కాస్ట్ ట్రీట్మెంట్’ విభాగం సెక్షన్ 18.4 ప్రకారం వైద్యం అందించలేమని ఈఎస్ఐ హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వైద్యులు గెంటేస్తున్నారు. కేంద్రంలోను రాష్ర్టంలోనూ కొత్త ప్రభుత్వాలు కార్మిక కుటుంబాల బతుకులకు భరోసా ఇవ్వాల్సింది పోయి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఈ సర్క్యులర్‌తో బజారున పడేశారు. గత కొన్నేళ్లుగా పుట్టుకతో వచ్చే జబ్బులతో పాటు జన్యుపరంగా వచ్చిన జబ్బులకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు పొందుతున్న కుటుంబ సభ్యులకు అలాంటి వైద్యం అందించకుండా నిర్దాక్షిణ్యంగా ఈఎస్ ఐ వైద్యులు గెంటేస్తున్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐ అసు పత్రి వైద్యులు కార్డుదారుని కుటుంబ సభ్యులలో ఒక రైన హీమోఫీలియా వ్యాధి బాధితునికి కొన్నాళ్లుగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించిన ఆ ఆసుపత్రి వైద్యులు ఇటీవల నిరాకరిస్తూ పంపించి వేశారు. కార ణం తెలపాలంటూ ఓ కార్డుదారు సమాచారం హక్కు చట్టం ద్వారా కోరగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమాచార చట్టం కింద సమాచారం అడిగిన కార్డుదారునికి ముందుగా కొంత సమాచారం మాత్రమే ఇవ్వగా, మళ్లీ వివరణతో కూడిన సమాచారం కావాలని ఆర్టీఐ కింద అడిగినా, 15 రోజుల తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి అడిగినా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. పుట్టుకతో వచ్చే వ్యాధులకు, జన్యుపరంగా వచ్చి న వ్యాధులకు, అక్టోబర్ 2014 తర్వాత ఈఎస్ఐ కార్డు పొందిన తర్వాత పుట్టిన పిల్లలకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆ సర్క్యులర్‌లో ఉంది. అంతేకాకుండా కార్డుదారులకు కూడా మూత్ర పిండాల వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులకు మొదటి సారి మాత్రమే వైద్యం అందిస్తామని ఆ తర్వాత మరో సారి అలాంటి సమస్యలు వస్తే మాత్రం వైద్యం చేయ మని నిరాకరిస్తున్నారు. కార్డ్డుదారులతోపాటు వారిపై ఆధారపడిన వారికి కూడా ప్రమాదాల్లో కాలు, చేయి విరిగినా ఒకసారి సిమెంట్ పట్టీ వేసిన తర్వాత మరో సారి చికిత్సలు అందించడంలేదు. ఈఎస్ఐ కార్డుదారు లకు కూడా అత్యవసర వైద్యం, టై అప్ హాస్పిటల్స్ పం పడం, రీయింబర్స్మెంట్ విధానంలో కూడా నిబంధ నలు కఠినతరం చేసి తిరకాసులు పెట్టింది. మొత్తంగా ఈఎస్ఐ కార్మికులకు ఈఎస్ఐసీ సంస్థ పరంగా సూపర్ స్పెషాలిటీ వైద్యానికి దూరం చేసే చర్యలు చేపట్టిందని కార్మికులు కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించి ఈఎస్ఐ కార్డుదా రులకు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు లబ్ధి చేకూరేలా కొత్తగా తీసుకువచ్చిన సర్క్యులర్‌ను రద్ద్దు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. -అబ్దుల్ రజాక్ హైదరాబాద్