కార్మిక రాజ్య భీమాసంస్థ (ఈఎస్‌ఐ) గుట్టు చప్పుడు కాకుండా కార్మిక కుటుంబాలను అధోగతిపాలు చేసిం ది. ఈఎస్‌ఐ కార్డుదారుల కుటుంబసభ్యులకు వైద్యం అందించడంలో మొహంచాటేసే ప్రక్రియను చేపట్టింది. చింతాసే మోక్ష అనే నినాదాన్ని ఈఎస్‌ఐ బుట్టదాఖలు చేసింది. మామూలు జబ్బులకు చికిత్స అందిస్తున్నప్ప టికీ పుట్టుకతో సంభవించే దీర్ఘకాలిక జబ్బులు, జన్యు పరంగా సంభవించే జబ్బులకు ఇకపై వైద్యం అందిం చలేమని గత అక్టోబర్‌లో ‘ఆపరేషనల్ మాన్యువల్ -2014 సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్’ పేరుతో ఓ సర్క్యులర్‌లను ఈఎస్‌ఐ సంస్థ జారీచేసింది. ఈ మాన్యువల్‌లోని ‘హై కాస్ట్ ట్రీట్‌మెంట్’ విభాగం సెక్షన్ 18.4 ప్రకారం వైద్యం అందించలేమని ఈఎస్‌ఐ హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వైద్యులు గెంటేస్తున్నారు. కేంద్రంలోను రాష్ర్టంలోనూ కొత్త ప్రభుత్వాలు కార్మిక కుటుంబాల బతుకులకు భరోసా ఇవ్వాల్సింది పోయి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఈ సర్క్యులర్‌తో బజారున పడేశారు.
గత కొన్నేళ్లుగా పుట్టుకతో వచ్చే జబ్బులతో పాటు జన్యుపరంగా వచ్చిన జబ్బులకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు పొందుతున్న కుటుంబ సభ్యులకు అలాంటి వైద్యం అందించకుండా నిర్దాక్షిణ్యంగా ఈఎస్ ఐ వైద్యులు గెంటేస్తున్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ అసు పత్రి వైద్యులు కార్డుదారుని కుటుంబ సభ్యులలో ఒక రైన హీమోఫీలియా వ్యాధి బాధితునికి కొన్నాళ్లుగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించిన ఆ ఆసుపత్రి వైద్యులు ఇటీవల నిరాకరిస్తూ పంపించి వేశారు. కార ణం తెలపాలంటూ ఓ కార్డుదారు సమాచారం హక్కు చట్టం ద్వారా కోరగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమాచార చట్టం కింద సమాచారం అడిగిన కార్డుదారునికి ముందుగా కొంత సమాచారం మాత్రమే ఇవ్వగా, మళ్లీ వివరణతో కూడిన సమాచారం కావాలని ఆర్టీఐ కింద అడిగినా, 15 రోజుల తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి అడిగినా ఇవ్వని దుస్థితి ఏర్పడింది.
పుట్టుకతో వచ్చే వ్యాధులకు, జన్యుపరంగా వచ్చి న వ్యాధులకు, అక్టోబర్ 2014 తర్వాత ఈఎస్‌ఐ కార్డు పొందిన తర్వాత పుట్టిన పిల్లలకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆ సర్క్యులర్‌లో ఉంది. అంతేకాకుండా కార్డుదారులకు కూడా మూత్ర పిండాల వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులకు మొదటి సారి మాత్రమే వైద్యం అందిస్తామని ఆ తర్వాత మరో సారి అలాంటి సమస్యలు వస్తే మాత్రం వైద్యం చేయ మని నిరాకరిస్తున్నారు. కార్డ్డుదారులతోపాటు వారిపై ఆధారపడిన వారికి కూడా ప్రమాదాల్లో కాలు, చేయి విరిగినా ఒకసారి సిమెంట్ పట్టీ వేసిన తర్వాత మరో సారి చికిత్సలు అందించడంలేదు. ఈఎస్‌ఐ కార్డుదారు లకు కూడా అత్యవసర వైద్యం, టై అప్ హాస్పిటల్స్ పం పడం, రీయింబర్స్‌మెంట్ విధానంలో కూడా నిబంధ నలు కఠినతరం చేసి తిరకాసులు పెట్టింది. మొత్తంగా ఈఎస్‌ఐ కార్మికులకు ఈఎస్‌ఐసీ సంస్థ పరంగా సూపర్ స్పెషాలిటీ వైద్యానికి దూరం చేసే చర్యలు చేపట్టిందని కార్మికులు కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించి ఈఎస్‌ఐ కార్డుదా రులకు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు లబ్ధి చేకూరేలా కొత్తగా తీసుకువచ్చిన సర్క్యులర్‌ను రద్ద్దు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.
-అబ్దుల్ రజాక్ హైదరాబాద్
కార్మికులకు వైద్యసేవలందించని ఈఎస్‌ఐ ఆసుపత్రులు
Published Fri, Apr 3 2015 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement
Advertisement