నాణ్యతపై ఫార్మా రంగం దృష్టి పెట్టాలి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇటీవలి పరిణామాలపై మెర్క్ మిలీపూర్ సంస్థ తాజాగా మూడో విడత ఎంప్రూవ్ సెమినార్ సిరీస్ను నిర్వహించింది. ఫార్మా పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ రిస్కులను తగ్గించుకొని, నాణ్యతనెలా పెంచుకోవచ్చు అన్న అంశంపై ఇందులో చర్చించారు.
ఈ సదస్సులో పాల్గొన్న మెర్క్ మిలీపూర్ ఇండియా ఫార్మ్ కెమికల్స్ సొల్యూషన్స్ విభాగం హెడ్ పీటర్ సాలాజార్ మాట్లాడుతూ దేశీయ ఫార్మా రంగం సమస్యలను ధీటుగా ఎదుర్కొని నిలకడ వృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నైతిక విలువలు, నిబంధనలకు కట్టుబడి ఉండటం వంటివి మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో కూడా చూపాల్సిన అవసరం ఉందని సదస్సును ప్రారంభించిన ఫార్మా రంగ విశ్లేషకుడు తపన్ రే చెప్పారు.