Encounter deaths
-
దంతెవాడలో బలగాల ఆపరేషన్ సక్సెస్.. మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 31 మంది నక్సలైట్లు మృతిచెందారు. దాదాపు 48 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దాదాపు 1,500 మంది భద్రత సిబ్బందితో 48 గంటలపాటు ఆపరేషన్ సాగినట్లు అధికారుల వెల్లడించారు. పొలాలు, చిత్తడి దారుల గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడినుంచి 12 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి ఎన్కౌంటర్ ప్రాంతానికి బలగాలలు చేరుకున్నాయి.ఇక, ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ అలియాస్ ఆర్కె, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు కాగా, కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుంది. మన బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్‌ను హతమార్చారు. మన సైనికులు గత రికార్డును బద్దలు కొట్టారు. ఎన్కౌంటర్ విషయంలో మా సైనికులను అభినందిస్తున్నాము. వారి ధైర్యానికి వందనం. ఈ ఘటన మావోయిస్టులు అణిచివేతకు మార్గం చూపించింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బెంగాల్లో మరో దారుణం -
ఛత్తీస్‌లో భారీ ఎన్కౌంటర్
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని షెర్పర్–సీతాగోటా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులను దారెకాస ఏరియా కమిటీ కార్యదర్శి సుఖ్‌దేవ్, అతని భార్య, ఏరియా కమిటీ సభ్యురాలు ప్రమీల, సీమా, మీనా, రితేష్, లలిత, శిల్పలుగా గుర్తించారు. మావోల కాల్పుల్లో ఆశారామ్ అనే జవానుకు గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు వెల్లడించారు. జూలై 28 నుంచి ఈ నెల 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలునిర్వహించిన నేపథ్యంలో పోలీసు బలగాలు దండకారణ్యంలో భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్) బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టు దళం ఎదురుపడింది. ఈ క్రమంలో బలగాలకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిపిన అనంతరం మావోలు అడవుల్లోకి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ డీఎం అవస్థి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఏకే 47, 303 రైఫిల్, కార్బన్ గన్, 12 బోర్ గన్లు ఉన్నాయి. మావోలను హతమార్చడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రశంసించారు. -
జగన్ లేఖతో వీడిన సస్పెన్స్
బొట్టెంతోగు ఎన్కౌంటర్ మృతులు తొమ్మిదిమంది చర్ల : తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పత్రికలకు విడుదల చేసిన లేఖతో బొట్టెంతోగు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులపై సస్పెన్స్ వీడింది. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మార్చి 1న జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసలు ప్రకటించారకు. వారి మృతదేహాలను కూడా అక్కడి నుంచి తరలించారు. అనంతరం రెండోరోజు కాల్పు లు జరిగిన ప్రాంతానికి సమీపంలో మరో మావోయిస్టు మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారని, మావోయిస్టులు ఆ మృతదేహాన్ని ఖననం చేసి నివాళులర్పిం చినట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే అవి పుకార్లేనని కొందరు.. నిజమని మరికొందరు వాదించారు. కాల్పులు జరిగిన ప్రాంతం చర్లకు 40 కిలోమీటర్ల దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. అక్కడకు వెళ్లి వివరాలు సేకరిం చడం కష్టంగా మారడంతో మూడు రోజుల పాటు తొమ్మిదో మృతదేహంపై సస్పెన్స్ కొనసాగింది. అయితే కాల్పుల ఘటనను వివరిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పత్రికలకు ఒక లేఖను విడుదల చేసి అందులో మృతి చెం దిన తొమ్మిది మంది పేర్లను ప్రకటించడంతో తొమ్మిదో మృతదేహంపై క్లారిటీ వచ్చింది. కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఎనిమిది మంది మృతదేహాలను పోలీసులు తీసుకువచ్చి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తొమ్మిదో మృతదేహం గడ్చిరోలి జిల్లా మావోయిస్టు కమాండర్ నక్కోటి సంకయ్య అలియాస్ మోన్కోదని, మృతదేహాన్ని గ్రామస్తులు, మావోయిస్టులు ఖననం చేశారని తెలుస్తోంది.