end of the election campaign
-
ఎన్నికల ప్రచారానికి తెర
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. 38 రోజుల పాటు ఏకధాటిగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా సభ సందర్భంగా టీఎంసీ–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో బెంగాల్లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి ఈసీ అనుమతించింది. ఉత్తరప్రదేశ్(13), పంజాబ్(13), పశ్చిమబెంగాల్(9), బిహార్(8), మధ్యప్రదేశ్(8), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్(3)తో పాటు చండీగఢ్ సీటుకు ఏడో విడతలో భాగంగా మే 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నేతల విస్తృత ప్రచారం.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ ఏకంగా 32 సీట్లను ౖకైవసం చేసుకుంది. బీజేపీని కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమనీ, తమకు ప్రధాని పదవిఅక్కర్లేదనీ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఇటీవల చేసిన ప్రకటనను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. విపక్షాల ఏకీకరణలో భాగంగానే హస్తం పార్టీ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసిందని చెబుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో ప్రధాని మోదీ(వారణాసి)తో పాటు బీజేపీ నేతలు కిరణ్‌ఖేర్(చండీగఢ్), భోజ్‌పురి నటుడు రవికిషన్(గోరఖ్‌పూర్) కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా(ఘాజీపూర్) కాంగ్రెస్ నేత పవన్‌కుమార్ బన్సల్(చండీగఢ్)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
ముగిసిన ఆరో విడత ప్రచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ఆరోవిడతలో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఉన్న 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్(8), మధ్యప్రదేశ్(8), పశ్చిమ బెంగాల్(8), ఢిల్లీ(7), జార్ఖండ్(4) రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో 45 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు సీట్ల కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బాక్సర్ విజేందర్ సింగ్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి హర్‡్ష వర్ధన్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, ఆప్ నేత అతీషీ ఢిల్లీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే యూపీ నుంచి కేంద్ర మంత్రి మేనకాగాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీలో ఉన్నారు. పశ్చిమబెంగాల్లో గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఈ 8 సీట్లను నిలబెట్టుకోవడానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. -
పంజాబ్, గోవాల్లో ముగిసిన ప్రచారం
-
పంజాబ్, గోవాల్లో ముగిసిన ప్రచారం
రేపే ఎన్నికలు న్యూఢిల్లీ: పంజాబ్, గోవా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్ శనివారం జరగనుంది. ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మోదీ ప్రభుత్వం రూ.1,000, పాత రూ.500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్‌లో 117 స్థానాలకు, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ♦ పంజాబ్ ప్రచారంలో రైతుల ఆత్మహత్యలు, డ్రగ్స్ మాఫియా ప్రధాన అస్త్రాలుగా నిలిచాయి. ♦ ఇక్కడ కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ లంబి, పాటియాలా స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.ప్రస్తుత సీఎం ప్రకాష్ సింగ్ బాదల్‌పై లంబిలో పోటీకి దిగుతున్నారు. ♦ మాజీ క్రికెటర్ సిద్ధూ అమృత్సర్ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ♦ గోవాలో అధికార బీజేపీ.. ఆప్ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. ♦ గోవాలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ల చరిష్మాను ప్రచారాస్త్రంగా ఉపయోగించింది. బీజేపీ గెలిస్తే పరీకర్ మళ్లీ ముఖ్యమంత్రిగా గోవాకు వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.