
పంజాబ్, గోవాల్లో ముగిసిన ప్రచారం
రేపే ఎన్నికలు
న్యూఢిల్లీ: పంజాబ్, గోవా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్ శనివారం జరగనుంది. ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మోదీ ప్రభుత్వం రూ.1,000, పాత రూ.500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్‌లో 117 స్థానాలకు, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
♦ పంజాబ్ ప్రచారంలో రైతుల ఆత్మహత్యలు, డ్రగ్స్ మాఫియా ప్రధాన అస్త్రాలుగా నిలిచాయి.
♦ ఇక్కడ కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ లంబి, పాటియాలా స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.ప్రస్తుత సీఎం ప్రకాష్ సింగ్ బాదల్‌పై లంబిలో పోటీకి దిగుతున్నారు.
♦ మాజీ క్రికెటర్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
♦ గోవాలో అధికార బీజేపీ.. ఆప్ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది.
♦ గోవాలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌ల చరిష్మాను ప్రచారాస్త్రంగా ఉపయోగించింది. బీజేపీ గెలిస్తే పరీకర్ మళ్లీ ముఖ్యమంత్రిగా గోవాకు వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.