ఫ్యాషన్ పోర్టల్ మింత్రా బంపర్ సేల్..
ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా కొత్త ఏడాదిలో గ్రాండ్ సేల్ నిర్వహించబోతుంది. 2017 జనవరి 3-5 వరకు 'ఎండ్ ఆఫ్ రీజన్' సేల్‌ను నిర్వహించనున్నట్టు మింత్రా పేర్కొంది. ఈ సేల్‌తో తమ విక్రయాలను 25 సార్లు ఎక్కువగా పెంచుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే ఈ సేల్‌పై, 1,800 బ్రాండులకు 50-80 శాతం డిస్కౌంట్‌ను మింత్రా ఆఫర్ చేయనుంది. డిజిటల్‌గా కొనుగోలు చేసేవారికి అదనంగా డిస్కౌంట్లను అందిస్తామంటోంది మింత్రా.
పెద్ద నోట్ల రద్దుతో పడిపోయిన అమ్మకాల నుంచి కూడా రికవరీ అయ్యేందుకు ఈ సేల్ దోహదం చేయనుందని కంపెనీ భావిస్తోంది. ఈ ఈవెంట్ ఇటు మింత్రా యజమాన్య సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ప్రయోజనకరంగా మారనుందట. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఫ్లిప్‌కార్ట్ వృద్ధి రేటు 50 శాతం మేర క్షీణించింది. సాధారణ రోజుల కంటే ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ ఈవెంట్లో దాదాపు 25 సార్లు తమ విక్రయాలను పెంచుకుంటామని, 2016 జూలైలో నిర్వహించిన దానికంటే రెట్టింపు వృద్ధిని నమోదుచేస్తామని మింత్రా సీఈవో ఆనంత్ నారయణన్ తెలిపారు. ఈ మూడు రోజుల్లో తమ ప్లాట్‌ఫామ్‌పై 15 మిలియన్ ప్రజలు నమోదవుతారని ఆశిస్తోంది. అంతేకాక 5-6 లక్షల కొత్త కస్టమర్లను పొందుతామని కంపెనీ చెబుతోంది..