engagement party
-
ఆకాశ్, శ్లోకల ప్రీ-ఎంగేజ్మెంట్లో నీతా అంబానీ డ్యాన్స్
-
నీతా అంబానీ డ్యాన్స్ వీడియో వైరల్
ముంబై : బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాల నిశ్చితార్థపు ముందస్తు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రేపు(శనివారం) సౌత్ ముంబైలోని అంటిలియాలో ఉన్న అంబానీ 27 అంతస్తుల భవనంలో వీరి నిశ్చితార్థపు వేడుకను అంబానీ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ నిశ్చితార్థానికి ముందస్తుగా జరుగుతున్న వేడుకలకు ఫిల్మ్ ఇండస్ట్రికి చెందిన షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్లు హాజరయ్యారు.షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్‌తో ఈ పార్టీకి హాజరు కాగ, సచిన్ తన సతీమణి అంజలితో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు. అంతేకాక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న ప్రియాంక చోప్రా, తన బాయ్‌ఫ్రెండ్ అమెరికా సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ఈ ప్రీ-ఎంగేజ్మెంట్ పార్టీలో తళుక్కున మెరిశారు. బుధవారం అంబానీ హౌజ్‌లో జరిగిన మెహందీ వేడుకతో ఈ ప్రీ-ఎంగేజ్మెంట్ పార్టీలు ప్రారంభయ్యాయి. ఆకాశ్, శ్లోకాలకు అంబానీ గారాల పట్టి, ఆ ఇంటి ఆడబిడ్డ ఇషా అంబానీ హారతి పడుతున్న వీడియోను సైతం ట్విటర్లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. అంతేకాక కొడుకు నిశ్చితార్థపు సంబురాల్లో నీతా డ్యాన్సులతో అలరించారు. ఆకాశ్ అంబానీ కూడా తన కాబోయే భార్య శ్లోకాతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ డ్యాన్స్
-
డాన్స్‌తో అదరగొట్టిన ఈషా, శ్లోక
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఈషా అంబానీకి ఇటీవలే బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్‌తో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక ఈ నెల 7న ముంబైలో ఘనంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుకలో ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలు స్టెప్పులు వేసి తమ కూతురు వివాహ సంతోషాన్ని పంచుకున్నారు. ఈషా అంబానీ నిశ్చితార్థ వేడుక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీతో ఈషా వేసిన డ్యాన్స్, తండ్రి ముఖేష్ అంబానీతో వేసిన స్టెపుల వీడియోలకు తెగ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా అన్న ఆకాశ్ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. వదినా మరదలు ఇద్దరూ కలిసి ‘పద్మావత్’లోని ‘ఘూమర్’ పాటకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇషా, శ్లోకాల జోడి బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ డ్యాన్స్ వీడియోలో ఎర్రటి లెహంగాలో శ్లోకా మెరిసిపోగా, ఐవర్ రంగు లెహంగాలో ఈషా జిగేల్‌మనిపిస్తోంది. కాగా వివాహం నిశ్చయమైన ఆనంద్, ఈషాలు ఎంతో కాలంగా మంచి స్నేహితులు. ఇటీవలే ఆనంద్, ఈషాకు మహాబలేశ్వర్ ఆలయంలో ప్రపోజ్ చేశాడు. ఆనంద్ ప్రతిపాదనకు ఈషా ఓకే చెప్పగానే, వెంటనే ఇరు కుటుంబాలు కలిసి విందు ఏర్పాటు చేయడం, అనంతరం ఎంగేజ్మెంట్ పార్టీ నిర్వహించడం జరిగింది. అటు ఆకాశ్ అంబానీ వివాహం కూడా ఈషా వివాహం నిశ్చయమవడానికి కొన్ని రోజుల ముందే రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చయమైంది. శ్లోకా మెహతా, ఆకాశ్ వివాహ నిశ్చితార్థ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. -
ఇషా కోసం ఆకాశ్ అంబానీ భావోద్వేగ ప్రసంగం
-
ఆకాశ్ అంబానీ భావోద్వేగ ప్రసంగం : వైరల్
ముంబై : బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్‌గా షేర్ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీ, తండ్రి ముఖేష్‌తో ఇషా వేసిన స్టెపులు, బాలీవుడ్ దిగ్గజాలతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో మంచి వ్యూస్‌ను సంపాదించుకుంటున్నాయి. తాజాగా అంబానీ బ్రదర్లు ఆకాశ్, ఆనంత్లు సోదరి ఇషా, బావ ఆనంద్‌తో కలిసి ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆకాశ్ అంబానీ తన సోదరి ఇషా కోసం భావోద్వేగ ప్రసంగాన్ని ఇచ్చారు. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ఆయన ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా వివరించారు. ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పార్టీలో ఆకాశ్ ఈ ప్రసంగమిచ్చారు. అంతకముందు ఇషా అంబానీ కూడా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థ సమయంలో తన కాబోయే వదినను ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితమే ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థం కూడా జరిగింది. కుదిరితే ఈ ఇరు జంటల వివాహం ఒకేసారి అంబానీ కుటుంబం నిర్వహించనుంది. కవలలైన ఇషా, అంబానీల పెళ్లిళ్లు నిశ్చయమవడంతో, అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కాగా, ఇషాకు ఎంతో కాలంగా స్నేహితుడైన ఆనంద్, మహాబలేశ్వరం ఆలయంలో ఆమెకు ప్రపోజ్ చేయగా, ఇషా అంగీకరించడం... అనంతరం ఇరు కుటుంబాలు కలిసి ఎంగేజ్మెంట్ పార్టీ నిర్వహించడం జరిగింది. -
కూతురుతో స్టెప్పులేసిన ముఖేష్ అంబానీ
ముంబై: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన గారాల పట్టి ఈషా వివాహం పిరామల్ ఎంటర్ప్రైజెస్ అధినేత అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్‌తో నిశ్చయం కావడంతో ఆ కుంటుంబం సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఈషా అంబానీ, ఆనంద్ పిరమాల్‌ల ఎంగేజ్మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖులు షారూక్‌ఖాన్, ఆమీర్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, కరణ్‌జోహార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈషా తన తల్లిదండ్రులతో కలిసి స్టెప్పులు వేసింది. ముఖేష్ అంబానీ తన కూతురుతో కలిసి సింగర్ హర్షదీప్ కౌర్ ‘ముద్డే నా దేఖో దిల్బారో’ పాటకు ఆనందంగా స్టెప్పులేశారు. ఇక ఇషా తల్లి నీతా అంబానీతో కలిసి కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన బార్బార్ దేఖో చిత్రంలోని నచాదే నె సారే పాటకు, శ్రీదేవి నటించిన ఇంగ్లిష్ వింగ్లిష్, తదితర బాలీవుడ్ సినిమాల పాటలకు స్టెప్పులేసి అందరిని అలరించారు. -
తల్లిదండ్రులతో ఇషా అంబానీ డ్యాన్స్
-
నీతా అంబానీ డ్యాన్స్ వీడియో
-
గ్రాండ్‌గా ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పార్టీ
ముంబై : బిలీనియర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ త్వరలోనే బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ కొడుకు ఆనంద్ పిరమల్‌ను మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ వార్త బయటికి వెల్లడించారు ఇరు కుటుంబ వర్గాలు. ఈ శుభ సమయాన్ని ఇరు కుటుంబాలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాయి. ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ల ఎంగేజ్మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అధికారికంగా సోమవారం నిర్వహించింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. వేడుకలో హాజరైన వారిలో సచిన్ టెండూల్కర్, కరణ్ జోహార్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్లు ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీలు దగ్గరుండి మరీ అతిథులను స్వాగతించారు. ఈ డిసెంబర్లో ఇషా, ఆనంద్‌ల వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇషా సోదరుడు ఆకాశ్ అంబానీ పెళ్లి కూడా ఇటీవలే రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. కుదిరితే ఈ ఇరు జంటల వివాహం ఒకేసారి అంబానీ కుటుంబం నిర్వహించనుంది. కవలలైన ఇషా, అంబానీల పెళ్లిళ్లు నిశ్చయమవడంతో, అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కాగా, ఇషాకు ఎంతో కాలంగా స్నేహితుడైన ఆనంద్, మహాబలేశ్వరం ఆలయంలో ఆమెకు ప్రపోజ్ చేయగా, ఇషా అంగీకరించడం... వెంటనే ఇరు కుటుంబాలు ఓ విందు కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ విందు కార్యక్రమంలో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, ఆనంద్ తల్లిదండ్రులు అజయ్, స్వాతిలతోపాటు ఇషా నానమ్మ, అమ్మమ్మలు కోకిలాబెన్ అంబానీ, పూర్ణిమాబెన్ దలాల్, సోదరులు ఆకాశ్, అనంత్‌లు పాల్గొన్నారు. ఆనంద్ సోదరి నందిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిసింది. కుటుంబ సభ్యుల విందు అనంతరం ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా ముంబైలో ఈ ఎంగేజ్మెంట్ పార్టీ నిర్వహించారు. -
ముకేశ్ తనయుడి ముందస్తు నిశ్చితార్థ విందు