బ్రిటన్‌లో భారత శాస్త్రవేత్తకు ఫెలోషిప్
లండన్: బ్రిటన్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలో పరిశోధనలు సాగిస్తున్న రవీందర్ దహియా అనే భారత శాస్త్రవేత్త సుమారు రూ. 10.83 కోట్ల విలువైన ‘ఇంజనీరింగ్ ఫెలోషిప్స్ ఫర్ గ్రోత్’ ఫెలోషిప్ గెలుచుకున్నారు. అడ్వాన్స్డ్ మెటీరియల్స్, రొబోటిక్ అండ్ అటానమస్ సిస్టమ్స్, సింథటిక్ బయాలజీ రంగాల్లో పరిశోధనలకు ప్రభుత్వ నిధులందించే ఇంజనీరింగ్ అండ్ ఫిజికల్ సెన్సైస్ రీసెర్చ్ కౌన్సిల్ (ఈపీఎస్ఆర్సీ)... రవీందర్‌ను ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. బ్రిటన్‌లోని 10 వర్సిటీల నుంచి రవీందర్ సహా మొత్తం 8 మంది ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.