England teams
-
ఆంధ్ర క్రికెట్లో టెస్టు పండుగ...
అరంగేట్ర టెస్టు మ్యాచ్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సిద్ధం పూర్తరుున ఏర్పాట్లు ప్రాక్టీస్ చేసిన భారత్, ఇంగ్లండ్ జట్లు పిజ్జాలు, బర్గర్లు తిన్నా... ఫాస్ట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేసినా... సంప్రదాయ పులిహోర, పాయసం తింటే కలిగే ఆనందమే వేరు. టెస్టు క్రికెట్ కూడా అలాంటిదే. వన్డే, టి20ల హోరులో అభిమానులు కొట్టుకుపోతున్నా... ఇప్పటికీ టెస్టు క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత తగ్గలేదు. ప్రపంచంలో ప్రతి క్రికెట్ సంఘానికి ఒక కల తప్పక ఉంటుంది. టెస్టు హోదా సాధించాలి, ఐదు రోజుల మ్యాచ్ నిర్వహించాలి. ఇప్పుడు వైజాగ్ వంతు వచ్చేసింది. గతంలో ఎన్నో వన్డేలు, టి20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఇప్పుడు టెస్టు క్రికెట్ కోసం ముస్తాబైంది. విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి చుట్టూ కొండలు. ఎటు చూసినా మనసును రంజింపజేసే ప్రకృతి అందాలు. పచ్చికతో కళకళలాడే మైదానం. కలర్ఫుల్గా కనిపించే స్టాండ్స. నిజానికి విశాఖపట్నంలోని స్టేడియం భారత్‌లోని అందమైన మైదానాల్లో ఒకటి. వెస్టిండీస్‌లోని సెరుుంట్ లూసియా తరహాలో సుందరంగా ఉంటుంది. పదకొండేళ్ల క్రితం భారత్, పాకిస్తాన్ల మధ్య వన్డేతో ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌లో సంచలన సెంచరీతోనే ఎమ్మెస్ ధోని వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లి కూడా ఇక్కడ ఆడిన ప్రతిసారీ రాణించాడు. ఒక రకంగా ఈ స్టేడియం భారత క్రికెటర్లకు బాగా కలిసొచ్చింది. స్టేడియం నిర్మించిన పదకొండేళ్ల తర్వాత వైజాగ్‌కు టెస్టు మ్యాచ్ నిర్వహించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ద్వారా రేపు (గురువారం) ఈ స్టేడియం టెస్టుల్లో అరంగేట్రం చేయబోతోంది. ఆరేళ్ల పోరాటం..: నిజానికి టెస్టు హోదా ఏ స్టేడియానికై నా అంత తొందరగా రాదు. గతంలో పెద్ద నగరాలకు మాత్రమే టెస్టులు నిర్వహించే అవకాశం ఉండేది. బీసీసీఐ వేదికల జాబితాలో ‘బి’ కేటగిరీ వేదికలు కేవలం వన్డేలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. నగరం స్థారుు, జనాభా, అభివృద్ధి, మైదానం, అందుబాటులో ఉండే వసతులు ఇలా అన్నీ ప్రమాణాలకు సరిపడా ఉంటేనే ఈ హోదా వస్తుంది. నిజానికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కూడా గతంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంతో పాటే టెస్టు హోదా కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ ‘బి’ గ్రేడ్ సెంటర్ల విషయంలో బీసీసీఐ విధానం వల్ల వైజాగ్‌కు అవకాశం రాలేదు. ఇటీవల అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని బీసీసీఐ పెద్దలంతా కలిసి ఇండోర్, ధర్మశాల, రాజ్‌కోట్, వైజాగ్ లాంటి చిన్న నగరాలకు కూడా టెస్టు హోదా ఇవ్వాలని నిర్ణరుుంచారు. పెద్ద నగరాల్లో టెస్టులకు ప్రేక్షకుల సంఖ్య సరిగా ఉండకపోవడంతో చిన్న నగరాలలో అరుుతే స్టేడియం నిండుతుందని భావించారు. అందుకే ఈసారి న్యూజిలాండ్ పర్యటనలో ఇండోర్‌కు... ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాజ్‌కోట్, వైజాగ్‌లకు తొలిసారి టెస్టు అవకాశం లభించింది. ‘మేం ఆరేళ్లుగా టెస్టు హోదా కోసం అడుగుతున్నాం. ఇంతకాలానికి మా కల సాకారమైంది. విశాఖపట్నం స్టేడియం దేశంలో ఏ వేదికతో పోల్చినా తక్కువ కాదు. అన్ని వసతులూ ఉన్నారుు. మాకు లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం. టెస్టును విజయవంతంగా నిర్వహిస్తాం’ అని ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు ‘సాక్షి’తో చెప్పారు. హడావుడి మొదలు...: అంతర్జాతీయ క్రికెట్ ఎక్కడ జరిగినా హడావుడి సహజం. ఇందుకు వైజాగ్ కూడా అతీతం కాదు. ఏసీఏ పరిధిలోనే విజయవాడలో భారత్, వెస్టిండీస్ మహిళల వన్డే సిరీస్ జరుగుతోంది. అరుునా ఏసీఏ పెద్దలు అంతా వైజాగ్‌లో మకాం వేసి టెస్టు మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టెస్టు క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఇంగ్లండ్ అభిమానులు కూడా ఆ జట్టుతో పాటు భారత్‌కు వచ్చారు. వాళ్లు ఎలాంటి వంక పెట్టకుండా స్టాండ్స మొత్తం నీట్‌గా ఉంచేలా చూస్తున్నారు. అవకాశం ఇస్తే ఇలా చేశారా అనే మాట రాకుండా ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఏసీఏ అధికారులు చెబుతున్నారు. రెండో టెస్టు కోసం సోమవారం నగరానికి చేరుకున్న భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం ప్రాక్టీస్ చేశారుు. ఉదయం పూట ఇంగ్లండ్ జట్టు సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా నెట్ సెషన్లో పాల్గొంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని అండర్సన్ మంగళవారం నెట్ సెషన్లో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జట్టు సాయంత్రం సెషన్లో రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేసింది. టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు 10 వేల మంది స్కూల్ విద్యార్థులకు ఏసీఏ అవకాశం కల్పిస్తోంది. వీరందరికీ ఉచిత రవాణా, భోజనం ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. తొలిరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని చెప్పారు. -
ఇక చావో రేవో!
భారత్, ఇంగ్లండ్ వన్డే నేడు గెలిచిన జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్‌కు ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామనే ధీమాతో ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ముక్కోణపు టోర్నీలో ఒక్క విజయం కూడా లేక... తుది జట్టు కూర్పు ఎలాగో అర్థం కాక తల్లడిల్లిపోతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే తక్షణమే ఓ విజయం కావాలి. ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం రావడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే ప్రపంచకప్‌నూ అయోమయ స్థితిలోనే ప్రారంభించాల్సి వస్తుంది. పెర్త్: ముక్కోణపు వన్డే టోర్నీలో సెమీఫైనల్‌లాంటి పోరుకు భారత్, ఇంగ్లండ్ జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగే టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు బోనస్ పాయింట్, రన్రేట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఆదివారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో ఢీకొంటుంది. మ్యాచ్ గెలిస్తే భారత్‌కు ప్రపంచ కప్‌కు ముందు మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది. లేదంటే ఇక నేరుగా వరల్డ్ కప్ వార్మప్లకే. వర్షం లేదా మరే కారణంగా మ్యాచ్ రద్దయినా, ‘టై’ అయినా ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. కోహ్లి రాణిస్తాడా! రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు కూడా దూరం కావడంతో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్ చెబుతున్నదాని ప్రకారం అతను మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావడం ఖాయమైంది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గట్లుగా ఆడితే ప్రపంచ కప్‌కు ముందు భారత్ శిబిరంలో పెద్ద ఆందోళన తగ్గిపోతుంది. ధావన్ ఘోరంగా ఆడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టు అతడిని కొనసాగిస్తోంది. అయితే మరో ఓపెనర్ రహానే కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. రహానేతో పాటు మూడో స్థానంలో రాయుడు, ఆ తర్వాత రైనా కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. రద్దయిన గత మ్యాచ్‌లో ప్రకటించిన జట్టునుంచి అక్షర్‌ను తప్పించి ఉమేశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ వికెట్‌పైనైనా మన పేసర్లు ఏ మాత్రం రాణించగలరో చూడాలి. ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ మరో వైపు ఇంగ్లండ్ జట్టు భారత్‌తో గత మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తొలి లీగ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన ఆ జట్టు ఆ తర్వాత ఆసీస్ చేతిలో ఓడినా 300కు పైగా స్కోరు చేసి చివరి వరకు పోరాడింది. జట్టులో ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లోకి వచ్చారు. ఇయాన్ బెల్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా, యువ ఆటగాడు టేలర్ నిలకడగా ఆడుతున్నాడు. అలీ, బొపారా, వోక్స్వంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ వికెట్ పేసర్లు ఫిన్, అండర్సన్లకు పండగలాంటిది. భారత్‌లాంటి జట్టును మరో సారి ఓడిస్తే ఇంగ్లండ్‌ను కూడా ప్రపంచ కప్ ఫేవరేట్లలో ఒకటిగా భావించాల్సి రావచ్చు. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, జడేజా, బిన్నీ, షమీ, ఇషాంత్, అక్షర్/ఉమేశ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, టేలర్, అలీ, రూట్, బట్లర్, బొపారా, వోక్స్, బ్రాడ్, అండర్సన్, ఫిన్. ‘ప్రస్తుతం మా అత్యుత్తమ 11 మంది ఎవరో గుర్తించాలి. అలా జరగాలంటే మొత్తం 15 మందీ పూర్తి ఫిట్నెస్తో ఉండాలి. లేకపోతే ప్రపంచకప్‌కు ముందు ఇబ్బందిపడతాం. టాపార్డర్‌పై మాకు ఆందోళన లేదు. మిడిలార్డర్లో మంచి భాగస్వామ్యాలు, చివరి 10-12 ఓవర్లు బాగా ఆడటం ముఖ్యం. కొన్నిసార్లు ఆటగాళ్లు తమకు నచ్చిన బ్యాటింగ్ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. కోహ్లి నాలుగో స్థానంలో ఆడితే జట్టు సమతుల్యంగా ఉంటుంది. రెండు మంచి షాట్లు ఆడితే ధావన్ ఫామ్‌లోకి వచ్చేస్తాడు. ఇంగ్లండ్‌తో గత మ్యాచ్ ఫలితం ప్రభావం మాపై ఉండదు’. - ధోని పిచ్, వాతావరణం ‘వాకా’పై సహజంగానే ఎక్కువ బౌన్స్ ఉంటుంది. ఈ పర్యటనలో భారత్ ఇక్కడ ఆడలేదు. మ్యాచ్ రోజు చిరుజల్లులు పడే అవకాశం ఉన్నా...ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా (37 డిగ్రీలు) ఉండవచ్చు. ఉ.గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం