ఆంధ్ర క్రికెట్‌లో టెస్టు పండుగ... | Test cricket festival in Andhra ... | Sakshi
Sakshi News home page

ఆంధ్ర క్రికెట్‌లో టెస్టు పండుగ...

Published Wed, Nov 16 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

ఆంధ్ర క్రికెట్‌లో టెస్టు పండుగ...

ఆంధ్ర క్రికెట్‌లో టెస్టు పండుగ...

అరంగేట్ర టెస్టు మ్యాచ్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సిద్ధం
పూర్తరుున ఏర్పాట్లు    ప్రాక్టీస్ చేసిన భారత్, ఇంగ్లండ్ జట్లు 

పిజ్జాలు, బర్గర్‌లు తిన్నా... ఫాస్ట్‌ఫుడ్‌ను ఎంజాయ్ చేసినా... సంప్రదాయ పులిహోర, పాయసం తింటే కలిగే ఆనందమే వేరు. టెస్టు క్రికెట్ కూడా అలాంటిదే. వన్డే, టి20ల హోరులో అభిమానులు కొట్టుకుపోతున్నా... ఇప్పటికీ టెస్టు క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత తగ్గలేదు. ప్రపంచంలో ప్రతి క్రికెట్ సంఘానికి ఒక కల తప్పక ఉంటుంది. టెస్టు హోదా సాధించాలి, ఐదు రోజుల మ్యాచ్ నిర్వహించాలి. ఇప్పుడు వైజాగ్ వంతు వచ్చేసింది. గతంలో ఎన్నో వన్డేలు, టి20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఇప్పుడు టెస్టు క్రికెట్ కోసం ముస్తాబైంది.

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి చుట్టూ కొండలు. ఎటు చూసినా మనసును రంజింపజేసే ప్రకృతి అందాలు. పచ్చికతో కళకళలాడే మైదానం. కలర్‌ఫుల్‌గా కనిపించే స్టాండ్‌‌స. నిజానికి విశాఖపట్నంలోని స్టేడియం భారత్‌లోని అందమైన మైదానాల్లో ఒకటి. వెస్టిండీస్‌లోని సెరుుంట్ లూసియా తరహాలో సుందరంగా ఉంటుంది. పదకొండేళ్ల క్రితం భారత్, పాకిస్తాన్‌ల మధ్య వన్డేతో ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌లో సంచలన సెంచరీతోనే ఎమ్మెస్ ధోని వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లి కూడా ఇక్కడ ఆడిన ప్రతిసారీ రాణించాడు. ఒక రకంగా ఈ స్టేడియం భారత క్రికెటర్లకు బాగా కలిసొచ్చింది. స్టేడియం నిర్మించిన పదకొండేళ్ల తర్వాత వైజాగ్‌కు టెస్టు మ్యాచ్ నిర్వహించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ద్వారా రేపు (గురువారం) ఈ స్టేడియం టెస్టుల్లో అరంగేట్రం చేయబోతోంది.

ఆరేళ్ల పోరాటం..: నిజానికి టెస్టు హోదా ఏ స్టేడియానికై నా అంత తొందరగా రాదు. గతంలో పెద్ద నగరాలకు మాత్రమే టెస్టులు నిర్వహించే అవకాశం ఉండేది. బీసీసీఐ వేదికల జాబితాలో ‘బి’ కేటగిరీ వేదికలు కేవలం వన్డేలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. నగరం స్థారుు, జనాభా, అభివృద్ధి, మైదానం, అందుబాటులో ఉండే వసతులు ఇలా అన్నీ ప్రమాణాలకు సరిపడా ఉంటేనే ఈ హోదా వస్తుంది. నిజానికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కూడా గతంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంతో పాటే టెస్టు హోదా కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ ‘బి’ గ్రేడ్ సెంటర్ల విషయంలో బీసీసీఐ విధానం వల్ల వైజాగ్‌కు అవకాశం రాలేదు. ఇటీవల అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని బీసీసీఐ పెద్దలంతా కలిసి ఇండోర్, ధర్మశాల, రాజ్‌కోట్, వైజాగ్ లాంటి చిన్న నగరాలకు కూడా టెస్టు హోదా ఇవ్వాలని నిర్ణరుుంచారు. పెద్ద నగరాల్లో టెస్టులకు ప్రేక్షకుల సంఖ్య సరిగా ఉండకపోవడంతో చిన్న నగరాలలో అరుుతే స్టేడియం నిండుతుందని భావించారు. అందుకే ఈసారి న్యూజిలాండ్ పర్యటనలో ఇండోర్‌కు... ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాజ్‌కోట్, వైజాగ్‌లకు తొలిసారి టెస్టు అవకాశం లభించింది. ‘మేం ఆరేళ్లుగా టెస్టు హోదా కోసం అడుగుతున్నాం. ఇంతకాలానికి మా కల సాకారమైంది. విశాఖపట్నం స్టేడియం దేశంలో ఏ వేదికతో పోల్చినా తక్కువ కాదు. అన్ని వసతులూ ఉన్నారుు. మాకు లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం. టెస్టును విజయవంతంగా నిర్వహిస్తాం’ అని ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు ‘సాక్షి’తో చెప్పారు.

హడావుడి మొదలు...: అంతర్జాతీయ క్రికెట్ ఎక్కడ జరిగినా హడావుడి సహజం. ఇందుకు వైజాగ్ కూడా అతీతం కాదు. ఏసీఏ పరిధిలోనే విజయవాడలో భారత్, వెస్టిండీస్ మహిళల వన్డే సిరీస్ జరుగుతోంది. అరుునా ఏసీఏ పెద్దలు అంతా వైజాగ్‌లో మకాం వేసి టెస్టు మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టెస్టు క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఇంగ్లండ్ అభిమానులు కూడా ఆ జట్టుతో పాటు భారత్‌కు వచ్చారు. వాళ్లు ఎలాంటి వంక పెట్టకుండా స్టాండ్‌‌స మొత్తం నీట్‌గా ఉంచేలా చూస్తున్నారు. అవకాశం ఇస్తే ఇలా చేశారా అనే మాట రాకుండా ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఏసీఏ అధికారులు చెబుతున్నారు.

రెండో టెస్టు కోసం సోమవారం నగరానికి చేరుకున్న భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం ప్రాక్టీస్ చేశారుు. ఉదయం పూట ఇంగ్లండ్ జట్టు సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా నెట్ సెషన్‌లో పాల్గొంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని అండర్సన్ మంగళవారం నెట్ సెషన్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జట్టు సాయంత్రం సెషన్‌లో రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేసింది.

టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు 10 వేల మంది స్కూల్ విద్యార్థులకు ఏసీఏ అవకాశం కల్పిస్తోంది. వీరందరికీ ఉచిత రవాణా, భోజనం ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. తొలిరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement