Entertainment tax exemption
-
'నా బంగారు తల్లి'కి వినోద పన్ను మినహాయింపు
హైదరాబాద్: నా బంగారు తల్లి సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవమైన కథను ఆధారంగా చేసుకుని హ్యుమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ ద్వారా వచ్చిన 'నా బంగారు తల్లి' సినిమా ప్రేక్షుకులను ఎంతో ఆకట్టుకుంది. వ్యభిచార ముఠా చేతిలో చిక్కిన యువతి కష్టాలు పడటం, అలాగే అక్కడినుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించే సన్నివేశాలను దర్శకులు బాగా తెరకెక్కించారు. ఈ సినిమా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వినోద పన్ను రాయితీకి కృషి చేస్తా..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హామీ హైదరాబాద్: తెలంగాణలో చిత్ర పరిశ్రమ కళాకారులకు వినోద పన్ను రాయితీ కల్పించేం దుకు కృషి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ ఆజంపురాలోని ఆయన స్వగృహం లో ‘నా భూమి’ చిత్రం లోగోను యూనిట్ సభ్యులతో కలిసి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంత కాలం సీమాంధ్రుల పెత్తనంలో అణచివేతకు గురయ్యామని, చిత్ర పరిశ్రమలో ఇక తెలంగాణ కళాకారులు సత్తా చాటాలని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు. అనంతరం ‘నా భూమి’ దర్శకుడు కుమార్ కన్నన్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం రోజున మొదలుపెట్టిన ఈ సినిమా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదని చెప్పారు.