వినోద పన్ను రాయితీకి కృషి చేస్తా..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హామీ
హైదరాబాద్: తెలంగాణలో చిత్ర పరిశ్రమ కళాకారులకు వినోద పన్ను రాయితీ కల్పించేం దుకు కృషి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ ఆజంపురాలోని ఆయన స్వగృహం లో ‘నా భూమి’ చిత్రం లోగోను యూనిట్ సభ్యులతో కలిసి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ..
ఇంత కాలం సీమాంధ్రుల పెత్తనంలో అణచివేతకు గురయ్యామని, చిత్ర పరిశ్రమలో ఇక తెలంగాణ కళాకారులు సత్తా చాటాలని మహమూద్ అలీ పిలుపునిచ్చారు. చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని చెప్పారు. అనంతరం ‘నా భూమి’ దర్శకుడు కుమార్ కన్నన్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం రోజున మొదలుపెట్టిన ఈ సినిమా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదని చెప్పారు.