Eros International
-
హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం
సాక్షి, ముంబై : కోవిడ్ -19 మహమ్మారి విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్టీఎక్స్ ఎంటర్టైన్మెంట్తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఈ కంపెనీలో సమాన వాటాను విలీనం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. విలీన వార్తలలో ఇవాళ ఎరోస్ ఇంటర్నేషనల్‌కు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో ఈ స్టాక్ ఏప్రిల్ 20 న ఉదయం ట్రేడింగ్ లో 10శాతం అప్పర్ సర్క్యూట్(రూ.16.35) వద్ద ఫ్రీజ్ అయింది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్టిఎక్స్ సంస్థ 'హస్ట్లర్స్', బ్యాడ్మామ్స్ లాంటి 34 సినిమాలను నిర్మించింది. మొత్తం 1.5 బిలియన్ డాలర్లను వసూలు చేసి బ్లాక్ బ్లస్టర్ సినిమాలుగా నిలవడం విశేషం. 11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లాఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్స్ కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు. (భారీగా తగ్గిన బంగారం ధర : ఈ అక్షయ తృతీయకు కొనేదెలా?) కోవిడ్-19 తో సినిమా రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ మహమ్మారితో సినిమా నిర్మాణ రంగం మొత్తం మూతపడింది. ఈ సమయంలో ఒక బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో కొత్త సంస్థను సృష్టిస్తున్నాం. ఏరోస్, ఎస్టీఎక్స్ విలీన సంస్థలో ప్రస్తుత వాటాదారులు 42శాతం వాటాను కలిగివుంటారు. టీపీజీ, హనీ క్యాపిటల్, లిబర్టీ గ్లోబల్‌తో పాటు ఎస్టీఎక్స్కు చెందిన ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి 125 మిలియన్ డాలర్ల తాజా మూలధనాన్ని సేకరిస్తున్నామని ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ద్వివేది వెల్లడించారు. బాలీవుడ్‌కు ఇది చాలా మంచి వ్యాపార వార్త అని, ఈ నిధులను ఫిల్మ్ ప్రొడక్షన్ , డిజిటల్ కంటెంట్ కోసం ఉపయోగిస్తామని తెలిపారు.ఇప్పటికే 75 మిలియన్ డాలర్లకు పైగా అందుకున్నామని, జూన్ చివరి నాటికి ఈ డీల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్
దగ్గుబాటి రానా టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కించింది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్’ పేర్లతో రూపొందింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లను చిత్ర బృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రానా, ఇతర ముఖ్యతారాగణం ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగానే మరో అస్త్రాన్ని విడుదల చేసింది ‘అరణ్య’టీం. ఈ చిత్రంలోని విష్ణు విశాల్‌కు చెందిన మరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో విష్ణు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రెండున్నరేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాం. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. ‘అరణ్య’ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. కథ విని పాత్రను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభుగారికి రుణపడి ఉంటాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది’అని టీజర్ రీలీజ్ సందర్బంగా రానా పైవిధంగా పేర్కొన్నాడు. జోయా హుస్సేన్, శ్రియా పిల్లావుంకర్, పుల్కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత రసూల్ సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశారు. Never ever thought i would have coffee on top of an #elephant:) #unnikrishnan #kaadan tamil #aranya telugu... Releasing on April 2nd pic.twitter.com/gc6EM28nOS — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) February 21, 2020 We're in 'aww' of how cute @TheVishnuVishal and his elephant friend look in #Aranya. To make new friends walk into your nearest theatre on April 02!#ErosNow | @RanaDaggubati | #PrabuSolomon | @ShriyaP | @zyhssn | @ErosIntlPlc | #SaveTheForest🐘 pic.twitter.com/ckTnWbZM7O — Eros Now (@ErosNow) February 23, 2020 చదవండి: వెరైటీ టైటిళ్లతో తేజ కొత్త చిత్రాలు.. హీరోలు వీరే ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ బాలయ్య సరసన అంజలి.. -
300 కోట్ల భారీ డీల్‌కు ఓకే చెప్పిన ప్రిన్స్?
-
బిజినెస్ లోనూ మహేశ్ నెంబర్ '1'
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 1 (నేనొక్కడినే) చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. అనధికార సమాచారం ప్రకారం మహేశ్ చిత్రానికి 72 కోట్ల రూపాయలతో ఫ్యానీ రేట్ ను చెల్లించి ఎరోస్ సొంతం చేసుకోవడం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా నిలిచింది. ప్రముఖ పంపిణీదారుడు ఎరోస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం కారణంగా పలు దేశాల్లోనూ, ఎక్కువ థియేటర్లలో మహేశ్ సినిమాను ప్రదర్శించడానికి మార్గం సుగమైంది. అంతేకాకుండా ప్రిన్స్ మార్కెట్ కూడా భారీ రేంజ్ లో విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 12.5 కోట్లు చెల్లించి జెమిని చానెల్ దక్కించుకుంది. అనేక ప్రత్కేకతల్ని సంతరించుకున్న నేనొక్కడినే చిత్ర ఆడియోను సొంతం చేసుకోవడానికి అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి.