బిజినెస్ లోనూ మహేశ్ నెంబర్ '1'
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 1 (నేనొక్కడినే) చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. అనధికార సమాచారం ప్రకారం మహేశ్ చిత్రానికి 72 కోట్ల రూపాయలతో ఫ్యానీ రేట్ ను చెల్లించి ఎరోస్ సొంతం చేసుకోవడం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా నిలిచింది.
ప్రముఖ పంపిణీదారుడు ఎరోస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం కారణంగా పలు దేశాల్లోనూ, ఎక్కువ థియేటర్లలో మహేశ్ సినిమాను ప్రదర్శించడానికి మార్గం సుగమైంది. అంతేకాకుండా ప్రిన్స్ మార్కెట్ కూడా భారీ రేంజ్ లో విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 12.5 కోట్లు చెల్లించి జెమిని చానెల్ దక్కించుకుంది. అనేక ప్రత్కేకతల్ని సంతరించుకున్న నేనొక్కడినే చిత్ర ఆడియోను సొంతం చేసుకోవడానికి అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి.