Nenokkadine
-
కృతి.. గతి తిరిగింది!
-
నేనా... రాజకీయాల్లోకా...!
-
మొన్న ట్విట్టర్ పోరు... నేడు రాజకీయ పోరు
-
హిట్ వేటలో ప్రిన్స్
-
భారీ అంచనాల నడుమ 1 నేనొక్కడినే
-
'1 నేనొక్కడినే' వాల్ పోస్టర్స్
-
'1 నేనొక్కడినే' ట్రైలర్
-
పోస్టర్ వివాదం: సమంతకు శేఖర్ కమ్ముల బాసట
ఇటీవల టాలీవుడ్లో చోటుచేసుకున్న పోస్టర్ వివాదంపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా వెబ్సైట్ ట్విటర్లో ‘1 నేనొక్కడినే’నే సినిమా పోస్టర్‌ను చూసి మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది అంటూ ఇటీవల టాలీవుడ్ నటి సమంత ట్వీట్ చేశారు. సమంత చేసిన ట్వీట్‌పై ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులు సైబర్ వార్ ప్రకటించారు. ట్విటర్, ఫేస్బుక్, ఇంటర్నెట్లో సమంతపై మాటల దాడి చేసి నానాయాగీ సృష్టించారు. సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్, టాలీవుడ్ నుంచి వెళ్లిపోవాలంటూ మాటల తూటాలను సంధించారు. అయితే ఆసమయంలో సమంతకు మద్దతుగా నిలిచిన వారెవరూ లేకపోయారు. తాజాగా సమంతకు దర్శకుడు శేఖర్ కమ్ముల బాసటగానిలిచారు. నేనొక్కడినే పోస్టర్‌పై సమంత చేసిన ట్వీట్‌ను చూశాను. సమంత ఫీల్ అయినట్టుగానే నేను ఫీలయ్యాను. మనం తిరోగమనం చెందుతున్నామా.. అందులో అనుమానం లేదు అని అన్నారు. సమంతకు వ్యతిరేకంగా అభిమానులు సృష్టించిన వివాదం షాక్ గురిచేసింది అని శేఖర్ తెలిపారు. అభిప్రాయం వెల్లడించడానికి సమంతకు స్వేచ్చ ఉందని అన్నారు. మహేశ్‌బాబును ఉద్దేశించి సమంత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని శేఖర్ తెలిపారు. మహిళలను కించపరుస్తూ సినిమాల్లో పాత్రలు రావడం ఇదే తొలిసారి కాదని ఆయన అన్నారు. అయితే ఆ పోస్టర్ ఓ అగ్ర హీరోయిన్ను ఫీలయ్యేలా చేసిందన్నారు. సమాజంలో ప్రతి మహిళా ఫీలయ్యేదే తను చెప్పిందన్నారు. ఇంకా మనం బ్రతికే ఉన్నాం అని ఫీలయ్యేలా వ్యాఖ్యలు చేసింది.. హ్యాట్సాఫ్ టు సమంతా, ఇలాంటి అంశాలపై చర్చించాలే చేశావు. పరిశ్రమకు ఇది శుభ సూచకం అని అన్నారు. -
గీత స్మరణం
సాకీ : నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనై అడుగుతున్నా నిన్ను కూడా అడగనా! పల్లవి : హూ ఆర్ యూ... హూ ఆర్ యూ... జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ ॥ఆర్ యూ॥ నువ్వంటే పేరుకాదు ఊరుకాదు ఫేస్‌కాదు నువ్వంటే క్యాష్ కాదు మరేంటి? నువ్వంటే టైమ్‌కాదు డ్రీమ్‌కాదు గేమ్‌కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి? హూ ఆర్ యూ... ఊ... (4) ॥ఆర్ యూ॥ చరణం : 1 నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా ఆటవా... పాటవా... వేటవా... వేటగాడివా... ॥ఆర్ యూ॥ చరణం : 2 నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి వీచక ముందే శ్వాసలోని తుఫానుందే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే నిప్పువా... నీరువా... గాలివా... ప్రశ్నవా... ॥ఆర్ యూ॥ చిత్రం : ‘1’ నేనొక్కడినే (2013) రచన : చంద్రబోస్ సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్ నిర్వహణ: నాగేశ్ -
మహేశ్ వన్ మూవీ ట్రైలర్ రిలీజ్
-
నేనొక్కడినే ఆడియో: ఫ్యామిలీతో మహేశ్
-
నేనొక్కడినే ఆడియో రిలీజ్
-
'1 నేనొక్కడినే' ఆడియో హైలెట్స్
-
నేనొక్కడినే ట్రైలర్ సాక్షి ఎక్స్‌క్లూజివ్
-
నాకంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్: మహేశ్ బాబు
‘‘నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని... అభిమానంతో ఆదరిస్తున్న మీ రుణం తీర్చుకోలేనిది. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను. చేతులెత్తి నమస్కరించడం తప్ప’’ అని అభిమానులను ఉద్దేశించి మహేష్ ఉద్వేగంగా మాట్లాడారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘1’. ‘నేనొక్కడినే’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. కృతి సనన్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీను వైట్లకు అందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ-‘‘చాలాకాలంగా దేవిశ్రీ, నేనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సుకుమార్ కారణంగా మా కలయిక కుదిరింది. సుకుమార్ ఐడియాస్ సూపర్బ్. మూడేళ్లు ఈ సినిమాకోసం ఆయన పడ్డ కష్టం కళ్లతో చూసిన వాణ్ణి. పీటర్‌హేన్స్ ఈ సినిమాలో నాతో పెద్ద పెద్ద సాహసాలే చేయించారు. బిల్డింగుల మీదనుంచి దూకించేశారు. నేను డాన్సులు చేయడం లేదని అభిమానుల్లో ఓ బాధ ఉంది. ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది. మరో సినిమా ఒప్పుకోకుండా రెండేళ్లు మాతో ఉండి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు కెమెరామేన్ రత్నవేలు. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. టోటల్‌గా నా కెరీర్లోనే బెస్ట్ మూవీ ఇది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘దేవిశ్రీతో నా అయిదో సినిమా ఇది. నా గత చిత్రాల్లాగే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఈ లుక్, ఈ కలర్ రావడానికి కారణం రత్నవేలు. సాంకేతికంగా ఈ సినిమా నిజంగా వండర్ అనే చెప్పాలి. ఓ కాఫీ షాప్‌లో రెండేళ్ల క్రితం మహేష్‌కి ఈ కథ చెప్పాను. రీసెంట్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్‌లో ఎక్కడో చిన్న మార్పు జరిగింది. ‘అప్పుడు నువ్వు ఈ కథ ఇలా చెప్పలేదే’అని అడిగారు. ఆయనలోని జ్ఞాపకశక్తి చూసి అనిపించింది ఎస్.. హీఈజ్ ‘1’ అని. మహేష్‌కి స్విమ్మింగ్ రాదు. కానీ... సముద్రంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్కై డైవింగ్ చేసేశారు. ఆయనలోని తెగువ చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. కెమెరాలోంచి ఏ కోణంలో చూసినా అందంగా ఉంటారు మహేష్. ఆయన 360 డిగ్రీల అందగాడు. ఆయన అందం చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. నిజంగా నేను లక్కీ. ఎలాగంటే... ఫ్యూచర్ సూపర్‌స్టార్‌ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గౌతమ్’’అని సుకుమార్ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్‌స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్‌బాబు, లహరి మ్యూజిక్ మనోహర్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వన్, ఎవడు సినిమాలలో థియేటర్లు ఫుల్
-
బిజినెస్ లోనూ మహేశ్ నెంబర్ '1'
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 1 (నేనొక్కడినే) చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. అనధికార సమాచారం ప్రకారం మహేశ్ చిత్రానికి 72 కోట్ల రూపాయలతో ఫ్యానీ రేట్ ను చెల్లించి ఎరోస్ సొంతం చేసుకోవడం టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా నిలిచింది. ప్రముఖ పంపిణీదారుడు ఎరోస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం కారణంగా పలు దేశాల్లోనూ, ఎక్కువ థియేటర్లలో మహేశ్ సినిమాను ప్రదర్శించడానికి మార్గం సుగమైంది. అంతేకాకుండా ప్రిన్స్ మార్కెట్ కూడా భారీ రేంజ్ లో విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని 12.5 కోట్లు చెల్లించి జెమిని చానెల్ దక్కించుకుంది. అనేక ప్రత్కేకతల్ని సంతరించుకున్న నేనొక్కడినే చిత్ర ఆడియోను సొంతం చేసుకోవడానికి అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి. -
సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
-
నేడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు బర్త్ డే