పోస్టర్ వివాదం: సమంతకు శేఖర్ కమ్ముల బాసట
పోస్టర్ వివాదం: సమంతకు శేఖర్ కమ్ముల బాసట
Published Fri, Dec 27 2013 6:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
ఇటీవల టాలీవుడ్‌లో చోటుచేసుకున్న పోస్టర్ వివాదంపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విటర్‌లో ‘1 నేనొక్కడినే’నే సినిమా పోస్టర్‌ను చూసి మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది అంటూ ఇటీవల టాలీవుడ్ నటి సమంత ట్వీట్ చేశారు. సమంత చేసిన ట్వీట్‌పై ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులు సైబర్ వార్ ప్రకటించారు. ట్విటర్, ఫేస్‌బుక్, ఇంటర్నెట్‌లో సమంతపై మాటల దాడి చేసి నానాయాగీ సృష్టించారు. సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్, టాలీవుడ్ నుంచి వెళ్లిపోవాలంటూ మాటల తూటాలను సంధించారు. అయితే ఆసమయంలో సమంతకు మద్దతుగా నిలిచిన వారెవరూ లేకపోయారు. తాజాగా సమంతకు దర్శకుడు శేఖర్ కమ్ముల బాసటగానిలిచారు.
నేనొక్కడినే పోస్టర్‌పై సమంత చేసిన ట్వీట్‌ను చూశాను. సమంత ఫీల్ అయినట్టుగానే నేను ఫీలయ్యాను. మనం తిరోగమనం చెందుతున్నామా.. అందులో అనుమానం లేదు అని అన్నారు. సమంతకు వ్యతిరేకంగా అభిమానులు సృష్టించిన వివాదం షాక్ గురిచేసింది అని శేఖర్ తెలిపారు. అభిప్రాయం వెల్లడించడానికి సమంతకు స్వేచ్చ ఉందని అన్నారు. మహేశ్‌బాబును ఉద్దేశించి సమంత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని శేఖర్ తెలిపారు.
మహిళలను కించపరుస్తూ సినిమాల్లో పాత్రలు రావడం ఇదే తొలిసారి కాదని ఆయన అన్నారు. అయితే ఆ పోస్టర్ ఓ అగ్ర హీరోయిన్‌ను ఫీలయ్యేలా చేసిందన్నారు. సమాజంలో ప్రతి మహిళా ఫీలయ్యేదే తను చెప్పిందన్నారు. ఇంకా మనం బ్రతికే ఉన్నాం అని ఫీలయ్యేలా వ్యాఖ్యలు చేసింది.. హ్యాట్సాఫ్ టు సమంతా, ఇలాంటి అంశాలపై చర్చించాలే చేశావు. పరిశ్రమకు ఇది శుభ సూచకం అని అన్నారు.
Advertisement
Advertisement