రేప్ నుంచి తప్పించుకోవాలని.. దూకేసింది
కోల్‌కతా: నమ్మిన బాయ్‌ఫ్రెండే కీచకుడి అవతారమెత్తాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దుండగుల బారి నుంచి రక్షించుకోవడానికి ఓ యువతి అపార్ట్మెంట్లో రెండో అంతస్తు నుంచి కిందికు దూకేసింది. ఈ ఘటన కోల్‌కతాకు సమీపంలోని హౌరాలో జరిగింది.
దుండగులు మత్తు మందు కలిపిన డ్రింక్ యువతికి ఇచ్చి లైంగికదాడికి ప్రయత్నించారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన యువతి తనను కాపాడుకునే ప్రయత్నంలో భవంతిపై నుంచి దూకేసింది. గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.