Ethiopian
-
ఇథియోపియాకు సహకారం అందిస్తాం
సాక్షి, అమరావతి: ఇథియోపియాలో వ్యవసాయ రంగం విస్తరణకు సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందం బుధవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. ఆర్బీకేలు, సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో తాము తెలుసుకున్న విషయాలను, అనుభవాలను సీఎంకు వివరించింది. ఈ వ్యవస్థలు రైతులకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని వివరించింది. ఆర్బీకే సాంకేతికతను తమ దేశంలోనూ ప్రవేశపెట్టడానికి సహకారం అందించాలని కోరింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఏ రూపంలో ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటాం. మీ సహాయాన్ని కూడా మేము తీసుకుంటాం ’ అని చెప్పారు. ‘మీ బృందం ఆర్బీకేలను సందర్శించడం, రైతులతో మాట్లాడడం సంతోషకరం. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలందాలి. ఈ ఆలోచనతోనే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకేలో పంటల సాగును బట్టి వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పట్టభద్రులను అందుబాటులో ఉంచాం. ప్రతి ఆర్బీకేలో కియోస్క్ పెట్టాం. ఆర్డర్ పెట్టిన వెంటనే నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నాం. తద్వారా కల్తీకి అడ్డుకట్ట వేశాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం. సాగవుతున్న ప్రతి పంటను ఈ–క్రాపింగ్ చేసి ఫిజికల్, డిజిటల్ రశీదులిస్తున్నాం. మార్కెట్లో పంట ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎం యాప్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా ధరలు తగ్గితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు నష్టం రాకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీ సాకారమవుతున్నాయి. ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటాన్ని నివారించాలన్నది మరో లక్ష్యం. ఇందుకోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్న విషయాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకువస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. సీఎం జగన్‌లో దార్శనికత కనిపిస్తోంది: ఇథియోపియా మంత్రి ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఆర్బీకేల వ్యవస్థ మమ్మల్ని చాలా ఆకట్టుకుంది. వీటికి బీజం వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో దూరదృష్టి, దార్శనికత కనిపిస్తోంది. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి’ అని ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ సీఎంతో జరిగిన భేటీలో చెప్పారు. ‘రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం, క్షేత్రస్థాయిలో మంచి మార్పులు తేవడం మమ్మల్ని అబ్బుర పరుస్తోంది. ఏపీలో ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడుగా నిలుస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాలను ఆర్బీకేలతో అనుసంధానం చేయడం చాలా బాగుంది. డిజిటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. ఆర్బీకేల విషయంలో మీ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వ్యవసాయ రంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం అందిపుచ్చుకుంటాం. మాకున్న పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను మీతో పంచుకుంటాం’ అని ఆయన చెప్పారు. అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇథియోపియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మాండెఫ్రో నిగుస్సియా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తున్న తీరు చాలా బాగుందని చెప్పారు. ఆర్బీకేల వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తోందన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేలా వ్యవసాయ రంగాన్ని ఈ వ్యవస్థ తీర్చిదిద్దుతోందని తెలిపారు. రైతుల సందేహాలు, సమస్యలు.. తదితర అంశాలన్నింటికీ క్షేత్రస్థాయిలో వన్‌స్టాప్ పద్ధతిలో పరిష్కారాలు సూచించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతోందని అన్నారు ఇతరులకూ ఈ వ్యవస్థ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. పశువుల కోసం మొబైల్ అంబులెన్సులు ఏర్పాటు కూడా బాగుందన్నారు. ఈ విధానాలను తాము కూడా అనుసరిస్తామని చెప్పారు. ఆర్బీకేల్లో అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్‌లో తమకు సహకారం అందించాలని ఇథియోపియా బృందం అభ్యర్థించగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా..
సాక్షి, విశాఖపట్నం: ‘బాగున్నారా.. కాఫీ చాలా చాలా బాగుంది.. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు’ అంటూ ఇథియోపియా కేంద్ర మంత్రి ఎర్గోగి టిస్‌ఫాయే తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్డీ చేశానని, ఆ సమయంలో విశాఖలో ఉన్నప్పుడు కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నానని చెప్పారు. పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోయినా, అర్థం చేసుకోగలనన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ తనకు తల్లితో సమానమని, వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం ఏయూకు విచ్చేసిన ఆమె ఇష్టాగోష్టిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వవిద్యార్థి పురస్కారం నేను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) అందించిన స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏయూలో ప్రొఫెసర్ల బోధన నాకు ఎంతో నచ్చింది, ఉపకరించింది. మానవ అధ్యయనానికి భారత్ సరైన వేదిక అని నాకు అనిపించింది. ఇక్కడ విభిన్న సంస్కృతులు, భాషలు, వైవిధ్యాల సమ్మేళనం దర్శనమిస్తుంది. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ఏయూ విద్యార్థిగా నేను గర్విస్తాను. భారత్‌ను ఎంచుకోమంటాను ప్రతీ సంవత్సరం ఇథియోపియా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. వీరికి భారత్‌కు వెళ్లాలని నేను సూచిస్తున్నాను. ముఖ్యంగా ఏయూలో చదువుకోవాలని, ఇక్కడ వాతావరణం, ప్రజలు బాగుంటారని వారికి పలు సందర్భాలలో తెలియజేస్తున్నా. వాతావరణం, ఆహారం, ప్రజలు తదితర అంశాల్లో భారత్, ఇథియోపియా దేశాల మధ్య సారూప్యత అధికంగా ఉంటుంది. ఏయూతో కలసి పని చేస్తాం నాకు తల్లితో సమానమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తాం. స్టార్టప్ రంగంలో ఇథియోపియాకు కొంత సహకారం, మార్గదర్శకత్వం అవసరం. ఏయూ ఇప్పటికే ఈ రంగంలో మంచి ప్రగతిని సాధించింది. ఈ దిశగా ఏయూ సహకారం తీసుకుంటాం. డ్యూయల్ డిగ్రీ కోర్సులను సైతం నిర్వహించే ప్రదిపాదన ఉంది. తెలుగు ప్రజలు మంచివారు నా పీహెచ్డీ పూర్తిచేసే క్రమంలో తెలుగు ప్రజలతో ఉండే అవకాశం లభించింది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. విశాఖ సుందరమైన నగరం. ఇక్కడ ఉన్న సమయంలో కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నారు. ఎవరు, ఎంత.. ఇలా అనేక పదాలను నేను ఇప్పటికీ మరచిపోలేదు. ఉన్నతంగా ఎదిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఇథియోపియా దేశస్తులు ఉన్నత స్థితిలో రాణిస్తున్నారు. విభిన్న శాఖల్లో మంత్రులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా సేవలు అందిస్తున్నారు. వీరంతా ఏయూ పూర్వవిద్యార్థులే అనే విషయం మరువలేదు. ఇథియోపియాలో భారత్ పెట్టుబడులు ఇథియోపియా దేశంలో అనేకమంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. వాటిని స్వాగతిస్తున్నాం. అదే విధంగా పెద్దసంఖ్యలో భారతీయులు ఇథియోపియా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నారు. మా దేశంలో శాంతిని కాంక్షిస్తాం. ఇండియా ఇన్క్రెడిబుల్ నేను తొలిసారిగా విద్యార్థిగా ఇథియోపియా నుంచి భారత్‌కు వచ్చే సమయంలో విమానాశ్రయంలో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అనే పదాన్ని చూశాను. ఇది నిజమా అనే భావన నాకు కలిగింది. తరువాత నేను భారత్‌లో ఉన్న కాలంలో చూసిన పరిస్థితులు, అనుభవాల తరువాత ఇది సరిగ్గా సరిపోతుందనే భావన నాకు కలిగింది. ఇథియోపియాలో ఏయూ ముద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేపట్టే సంస్కరణలు, అభివృద్ధి ఆలోచనలు ఇథియోపియాపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ అధికారులు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల నుంచి ఇథియోపియాకు చేరతాయి. పరోక్షంగా ఇథియోపియా విద్యా వ్యవస్థను ఏయూ ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. (క్లిక్: పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్ జర్నీ.. ఎందుకో తెలుసా..?) -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
-
ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి
-
సాయం చేయండి ప్లీజ్ - సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి ట్విటర్లో బాధితుల పట్ల శరవేగంగా స్పందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. ఇథియోపియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆచూకీని కనుక్కోవడంలోనూ ఒక పక్క ఎంబసీ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ, పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ, మరో పక్క వారి బంధువులకు సమాచారం అందించడంలో మానవతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా పర్యావరణశాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి ఇంకా ఆమె మరణ వార్త చేరకపోవడంపై ఆమె ట్వీట్ చేశారు. శిఖా గార్గ్ మృతి గురించి చెప్పేందుకు ఆమె భర్తకు ఎన్నో సార్లు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండి ప్లీజ్ అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. సాయం చేయండంటూ ఆమె నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. కాగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిదిమంది సిబ్బంది సహా 157మంది దుర్మరణం చెందగా, వీరిలో నలుగురు భారతీయులున్నారు. I am trying to reach the family of Shikha Garg who has unfortunately died in the air crash. I have tried her husband's number many times. Please help me reach her family. — Sushma Swaraj (@SushmaSwaraj) March 11, 2019 -
విడుదలైన ఆ ఇద్దరూ తెలుగువారే!
ముంబై: ఇథియోపియాలో నిర్బంధానికి గురై విడుదలైన ఇద్దరూ తెలుగువారేనని సమాచారం. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనుబంధ ఐటీఎన్‌ఎల్ కంపెనీ ఇథియోపియాలో చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొన్న స్థానికులు వేతనాలు అందకపోవడంతో గత నెల 25వ తేదీ నుంచి ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం, విదేశాంగ శాఖ అధికారుల జోక్యంతో భాస్కర్‌రెడ్డి, హరీష్ బండి అనే ఇద్దరిని స్థానికులు రెండు రోజుల క్రితం విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి రాజధాని ఆడిస్అబాబాకు తరలించినట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది. మిగతా వారికి కూడా విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న భారత ఉద్యోగులకు జూలై నుంచి, స్థానికులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సమాచారం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థను గట్టెక్కించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. -
ఇథియోఫియా సదస్సుకు హాజరైన ఎంపీ ‘రాపోలు’
పాలకుర్తి : ఆఫ్రికాలోని ఇథియోఫియా దేశంలో జనాభా, ఆహార భద్రత అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ హాజరయ్యారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ పేరిట ఏషియన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాపోలు ప్రసంగించారు. అనంతరం ఇథియోఫియాలోని భారతీయులను ఆయన కలుసుకున్నారు.