ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు.