BLACKBOX
-
విమానం కూలిన చోటు గుర్తించాం
జకార్తా: ఇండోనేసియాలో 62 మందితో కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది. ఘటనపై ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇండోనేసియా పౌరులు, ప్రభుత్వం తరఫున బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. బాధిత కుటుంబాలకు భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఇండోనేసియాకు భారత్ తోడుగా నిలుస్తుందన్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం గతంలో అమెరికా విమానయాన సంస్థలు వాడిందేనని శ్రీవిజయ ఎయిర్ ప్రెసిడెంట్ డైరెక్టర్ జెఫర్సన్ ఇర్విన్ జవెనా అన్నారు. 26 ఏళ్ల క్రితం తయారైన ఈ విమానం ఫూర్తి ఫిట్నెస్తో ఉందని తెలిపారు. శనివారం విమానం జకార్తా నుంచి గంట ఆలస్యంగా బయలుదేరడానికి వాతావరణం సరిగా లేకపోవడమే కారణమని వివరించారు. విషాద ఘటనపై ఇండోనేసియా అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్ బగుస్ పురుహితో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘విమానం నుంచి ఆఖరు సారిగా నమోదైన సిగ్నల్ ఆధారంగా ప్రమాద ప్రాంతాన్ని గుర్తించాము. బ్లాక్‌బాక్స్‌లుగా పిలిచే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ల నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సిగ్నళ్లను నౌకాదళం కనుగొంది. వీటి ఆధారంగా సముద్ర జలాల్లో అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించాం’అని వివరించారు. అతి త్వరలోనే వాటిని వెలికితీసి, ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలుసుకుంటామని మిలటరీ చీఫ్ హదీ టిజాజంతో అన్నారు. ఆదివారం సముద్ర జలాల్లో 75 అడుగుల లోతులో రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలతో కూడిన ప్రధాన విమాన భాగాలను వెలికితీశామన్నారు. శ్రీ విజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి పొంటియానక్ వైపు బయలుదేరింది. నాలుగు నిమిషాలకే కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
-
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్‌క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్‌పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. బోయింగ్‌కు చైనా షాక్! చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. -
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపు
జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాద ఘటనపై అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్ బాక్స్‌ను ఇండోనేసియా అధికారులు గుర్తించారు. జావా సముద్రంలో బ్లాక్ బాక్స్‌ను కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం.. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు వారాల క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. -
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు
ఇండోనేసియా : జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేసింది. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం సముద్రం అడుగు నుంచి భాగం నుంచి సంకేతాలు వస్తున్నట్లు అన్వేషణ బృందాలు గుర్తించాయి. బుధవారం విమాన తోక శకలాన్ని అన్వేషణ బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు బృందాలు గర్తించాయి. ఆదే విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.దాంతో బ్లాక్ బాక్స్‌ను వెలికితీసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ బాక్స్‌ను బయటకు తీస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.