ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు | AirAsia jet's black box pings detected: official | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు

Published Fri, Jan 9 2015 10:35 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు - Sakshi

ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు

ఇండోనేసియా : జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేసింది. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం సముద్రం అడుగు నుంచి భాగం నుంచి సంకేతాలు వస్తున్నట్లు అన్వేషణ బృందాలు గుర్తించాయి.

బుధవారం విమాన తోక శకలాన్ని అన్వేషణ బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు బృందాలు గర్తించాయి. ఆదే విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.దాంతో బ్లాక్ బాక్స్ను వెలికితీసేందుకు  అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ బాక్స్ను బయటకు తీస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement