ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపు
జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాద ఘటనపై అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్ బాక్స్ను ఇండోనేసియా అధికారులు గుర్తించారు. జావా సముద్రంలో బ్లాక్ బాక్స్ను కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం.. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు వారాల క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు.