ethylene
-
మామిడిని వీడని రసాయనాల భూతం
-
రిలయన్స్ ఎథిలీన్ సామర్థ్యం రెట్టింపు
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫ్–గ్యాస్ క్రాకర్ ప్లాంటును తమ జామ్‌నగర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసింది. మిగతా ఉత్పత్తి ప్లాంట్లు మొదలైన వాటన్నింటితో కలిపి దీని సామర్థ్యం వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల మేర ఉంటుందని రిలయన్స్ తెలిపింది. ‘ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి పెద్ద రిఫైనరీ ఆఫ్–గ్యాస్ క్రాకర్ (ఆర్‌వోజీసీ) కాంప్లెక్స్‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఆర్ఐఎల్ పెట్రోకెమికల్స్ వ్యాపార లాభదాయకతకు, నిలకడగా రాణించేందుకు ఇది తోడ్పడగలదని చెప్పారు. రిలయన్స్‌కి జామ్‌నగర్‌లో ఉన్న రెండు రిఫైనరీల నుంచి వచ్చే వాయువులను ప్రాసెస్ చేసి.. పెట్రోకెమికల్స్ ఉత్పత్తుల తయారీకి అనువైన ఎథిలీన్, ప్రొపిలీన్ తదితర ముడి రసాయనాలను అందించేందుకు ఇది తోడ్పడనుంది. ఆర్‌వోజీసీ నుంచి వచ్చే ఎథిలీన్‌ను.. మిగతా ప్లాంట్లలోకి మళ్లించి మోనో ఎథిలీన్ గ్లైకాల్, పాలీ ఎథిలీన్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఆర్‌వోజీసీ అందుబాటులోకి రావడంతో మొత్తం అయిదు సైట్లలో ఎథిలీన్ సామర్థ్యం దాదాపు ఏటా 4 మిలియన్ టన్నులకు చేరిందని కంపెనీ పేర్కొంది. దీంతో 2014లో దాదాపు 16 బిలియన్ డాలర్లతో చేపట్టిన భారీ విస్తరణ పనులు పూర్తయినట్లు తెలిపింది. -
కార్బైడ్ వాడితే.. ఆరునెలల జైలు
హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్థాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కృత్రిమంగా మగ్గ పెట్టిన పండ్లను తినడం ద్వారా కాన్సర్‌తో పాటు జీర్ణ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర ప్రచార సామగ్రి సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తోందని తెలిపారు. ఆరుగురు వ్యాపారులు సొంతంగా ఇథిలీన్ ఛాంబర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారని.. మార్చి ఆఖరులోగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రై వేటు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఇథిలీన్ ఛాంబర్లు వుండగా.. అవసరమైన చోట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.