ETIM
-
చైనాలో ఉగ్రవాద దాడి
- రద్దీ మార్కెట్లో 12కు పైగా పేలుళ్లు - 31 మంది మృతి; 94 మందికి గాయూలు బీజింగ్: చైనాలోని జింజియూంగ్ ప్రాంతీయ రాజధాని ఉరుంఖి పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన రెండు వాహనాలతో రద్దీ మార్కెట్లోకి దూసుకువెళ్లిన మిలిటెంట్లు 12కు పైగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో కనీసం 31 మంది మరణించగా.. 94 మంది గాయపడ్డారు. ఉదయం 7.50 (స్థానిక సమయం) ప్రాంతంలో రెన్మిన్ పార్క్ సమీపంలోని పార్క్ నార్త్ స్ట్రీట్ వద్ద ఉన్న రోడ్డుపక్క కంచెల్ని ఎలాంటి లెసైన్స్ ప్లేట్లు లేని వాహనాల (ఎస్‌యూవీలు)తో వేగంగా ఢీకొట్టిన మిలిటెంట్లు ఓ ఆరుబయలు మార్కెట్ లోనికి ప్రవేశించారు. ప్రజలను ఢీకొడుతూనే చివరివరకు వెళ్లిన వారు పేలుళ్లకు పాల్పడినట్టు జింజియూంగ్ ఇఘర్ స్వయంపాలిత ప్రాంత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వాహనాల ముందు విసిరిన పేలుడు పదార్థాలు పేలిపోరుునట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ భారీ ఉగ్రదాడి కి నిషేధిత తూర్పు తర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఈటీఐఎం) కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)కు, అఫ్ఘానిస్థాన్‌కు సరిహద్దు ప్రాంతమైన జింజియూంగ్ స్వాతంత్య్రం కోసం ఈ ఉగ్ర సంస్థ పోరాడుతోంది. ఉగ్రదాడికి కారకులైనవారిని కఠినంగా శిక్షిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిపింగ్ చెప్పారు. -
చైనా రైల్వే స్టేషన్లో కత్తులతో స్వైర విహారం
దుండగుల దాడుల్లో 27 మంది మృతి, 109 మందికి గాయాలు ఉగ్రవాద దాడిగా అనుమానాలు బీజింగ్: చైనా, యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ రైల్వే స్టేషన్లో శనివారం కత్తులతో దాడులకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల బృందం 27 మందిని హతమార్చింది. ఈ దాడిలో మరో 109 మంది గాయపడ్డారని ‘జిన్హువా’ వార్తాసంస్థ వెల్లడించింది. నలుపు రంగు దుస్తులు ధరించి రెండ్రెండు కత్తులు పట్టుకున్న బృందం ప్రజలను తరుముతూ విచ క్షణారహితంగా దాడిచేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. వచ్చే వారం చైనీస్ పార్లమెంటు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఉగ్ర చర్య చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు. దాడిచేసిన వారు జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో అల్ కాయిదాతో సంబంధాలు నెరుపుతూ ముస్లిం ఉయూర్లలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ‘ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటీఐఎం)’ ఉగ్రవాద సంస్థకు చెందినవారు కూడా కావచ్చని అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అస్థిరతతో ఉన్న ఈ ప్రావిన్స్‌లో గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. గతేడాది బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద పర్యాటకుల గుంపులోకి ఓ కారుతో దూసుకెళ్లిన ఈటీఐఎం సభ్యులు ముగ్గురు పౌరులను హతమార్చారు.