eureka forbes company
-
యురేకా ఫోర్బ్స్‌కు షాపూర్జీ టాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ నుంచి నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ పూర్తిగా బయటపడింది. కంపెనీలో మిగిలిన 8.7 శాతం వాటాను కొత్త యాజమాన్య సంస్థ లునోలక్స్కు విక్రయించింది. పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు చెందిన లునోలక్స్ 1.68 కోట్ల ఈక్విటీ షేర్లను(8.7 శాతం వాటా) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని యురేకా ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 19న కుదిరిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ లావాదేవీని షాపూర్జీ పల్లోంజీ పూర్తి చేసినట్లు పేర్కొంది. షాపూర్జీ నుంచి రూ. 4,400 కోట్లకు యురేకా ఫోర్బ్స్‌ను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ ఇంటర్నేషనల్ గతేడాది సెప్టెంబర్‌లో డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్‌లో యురేకా ఫోర్బ్స్ నుంచి షాపూర్జీకి చెందిన ఏడుగురు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకోగా.. ఈ వారం మొదట్లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ మాజీ సీఈవో ప్రతీక్ పోటాను చీఫ్‌గా యాడ్వెంట్ ఎంపిక చేసింది. ప్రతీక్ ఆగస్ట్ 16 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
యాడ్వెంట్ చేతికి యురేకా ఫోర్బ్స్!
ముంబై: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందు నిలవనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటర్ ప్యూరిఫయర్స్ దిగ్గజం యురేకా ఫోర్బ్స్ విక్రయానికి వీలుగా ప్రమోటర్ గ్రూప్ షాపూర్జీ పల్లోంజీ ఇప్పటిఏ బిడ్స్‌ను ఆహ్వానించిన విషయం విదితమే. కంపెనీ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజాలు యాడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్తోపాటు.. స్వీడిష్ హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ఎలక్ట్రోలక్స్ బిడ్స్ పోటీపడుతున్నట్లు సంబంధిత వర్గాలు జూన్‌లో పేర్కొన్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఫోర్బ్స్ అండ్ కంపెనీకి అనుబంధ సంస్థే యురేకా ఫోర్బ్స్. కోవిడ్–19 పరిస్థితుల తదుపరి ఆరోగ్యం, పరిశుభ్రత, గృహ సౌకర్యాలు(హోమ్ ఇంప్రూవ్మెంట్) విభాగంపై అధిక దృష్టిపెట్టిన గ్రూప్ యురేకా ఫోర్బ్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింది. తద్వారా రుణ భారాన్ని సైతం తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. డీల్‌కు వీలుగా..: యురేకా ఫోర్బ్స్ విక్రయానికి అనువుగా డీల్‌ను కుదుర్చుకునేందుకు షాపూర్జీ గ్రూప్ అంతర్గత పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోర్బ్స్ అండ్ కంపెనీ నుంచి యురేకా ఫోర్బ్స్‌ను విడదీయనున్నట్లు తెలియజేశాయి. యురేకాను కొనుగోలు చేయడంలో యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు అవకాశాలు అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. క్రాంప్టన్ గ్రీవ్స్ డీల్ ద్వారా లాభపడిన యాడ్వెంట్కు కన్జూమర్ విభాగంలో పట్టుండటం మద్దతుగా నిలవనున్నట్లు తెలియజేశాయి. రూ. 4,500–5,000 కోట్ల మధ్య విక్రయ ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. -
చేవెళ్ల డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థులకు యురేకా ఫోర్బ్స కంపెనీ జాబ్‌మేళా నిర్వహించింది. పలువురు విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రావణ్‌కుమార్ అన్నారు. కళాశాలలో చదువుకుని, ఆ తర్వాత ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జాబ్‌మేళాకు హాజరైన విద్యార్థులు యురేఖ ఫోబ్స్ కంపెనీ ప్రతినిధులు అయ్యప్ప, ఎండీ రఫీయోద్దీన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన వారు డిసెంబర్ 2వతేదీలోపు జాబ్‌లో జాయిన్ కావాలని వారు చెప్పారు. కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కొందరు విద్యార్థినులు కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పలు రకాల సాంప్రదాయ వంటకాలను ఇందులో ఉంచారు. ఫుడ్‌ఫెస్టివల్‌లో వంటకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వెంకటరమణ, శ్రీలక్ష్మి, జ్యోతీర్మయి, సుజాత పాల్గొన్నారు.