evado okadu
-
పట్టాలపైకి ప్రాజెక్ట్!
రవితేజ సినిమా విడుదలై అప్పుడే ఏడాది కావొస్తోంది. అప్పట్నుంచీ మాస్ మహారాజ్ ఖాళీనే! ప్రపంచ యాత్రలో ఉన్నారని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారనుకోండి. అయితే... ‘బెంగాల్ టైగర్’ విడుదలకు ముందు, గత ఏడాది విజయదశమికి ‘ఎవడో ఒకడు’కి ఆయన కొబ్బరికాయ కొట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మాతగా ప్రారంభమైన ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే చతికిలపడింది. హీరో పారితోషకం విషయంలో పొరపొచ్చాలు రావడంతో ‘ఎవడో ఒకడు’ ఆగిందనే పుకార్లు వినిపించాయి. కారణాలు ఏవైనా.. అప్పట్నుంచీ రవితేజ పలు కథలు విన్నారు. కానీ, ఒక్క కథ కూడా ఓకే చేయలేదు. తాజా సమాచారం ఏంటంటే... అనిల్ రావిపూడి చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజే నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి గత సినిమా ‘సుప్రీమ్’ను ‘దిల్’ రాజు నిర్మించారు. ఆ తర్వాత రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. అదీ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగింది. ఇప్పుడీ హీరో, దర్శకుణ్ణి ‘దిల్’ రాజు కలిపారన్నమాట! -
ప్రయోగానికి రెడీ అవుతున్నాడు
మాస్ మహరాజ్ రవితేజ అంటేనే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటివరకు తన కెరీర్లో ఎక్కువగా ఆ తరహా సినిమాలే చేస్తూ వస్తున్న రవితేజ త్వరలో ఓ ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న రవితేజ, నెక్ట్స్ సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఎవడో ఒకడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రభినయం చేయనున్న రవితేజ, ఒక పాత్రలో 50 ఏళ్ల వ్యక్తిగా, మరో పాత్రలో 20 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నాడట. ముందుగా 20 ఏళ్ల కుర్రాడి పాత్రను షూట్ చేయనున్నారట, అందుకోసం ఇప్పటినుంచే రెడీ అవుతున్నాడు రవితేజ. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రయోగానికి దిగుతున్న రవితేజకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. -
'కంచె' భామకు సెకండ్ ఛాన్స్
'కంచె' సినిమాలో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్‌కు ఆ సినిమా ఆశించిన స్ధాయిలో బ్రేక్ ఇవ్వలేదు. సక్సెస్ క్రెడిట్ అంతా హీరో, డైరెక్టర్లకే వెళ్లిపోవటంతో, మరో లక్కీ ఛాన్స్ కోసం ఎదురుచూసింది ఈ బ్యూటీ. ఆ ఛాన్స్ రానే వచ్చింది. టాలీవుడ్ సీనియర్ రవితేజ్ హీరోగా నటిస్తున్న 'ఎవడో ఒకడు' సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది ప్రగ్యా. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నటించిన అనుభవం లేని ప్రగ్యాకు రవితేజ సినిమాలో ఆఫర్ రావటం చిన్న విషయమేమి కాదు. కంచె సినిమాలో నటనతో పాటు గ్లామర్‌తోను ఆకట్టుకున్న ఈ భామ తొలిసారిగా స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవుతోంది. మళయాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాతో ప్రగ్యా... స్టార్ స్టేటస్ అందుకుంటుదేమో చూడాలి.