పట్టాలపైకి ప్రాజెక్ట్! | raviteja new movie plans | Sakshi
Sakshi News home page

పట్టాలపైకి ప్రాజెక్ట్!

Published Thu, Dec 8 2016 12:30 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పట్టాలపైకి ప్రాజెక్ట్! - Sakshi

పట్టాలపైకి ప్రాజెక్ట్!

రవితేజ సినిమా విడుదలై అప్పుడే ఏడాది కావొస్తోంది. అప్పట్నుంచీ మాస్ మహారాజ్ ఖాళీనే! ప్రపంచ యాత్రలో ఉన్నారని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారనుకోండి. అయితే... ‘బెంగాల్ టైగర్’ విడుదలకు ముందు, గత ఏడాది విజయదశమికి ‘ఎవడో ఒకడు’కి ఆయన కొబ్బరికాయ కొట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మాతగా ప్రారంభమైన ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే చతికిలపడింది. హీరో పారితోషకం విషయంలో పొరపొచ్చాలు రావడంతో ‘ఎవడో ఒకడు’ ఆగిందనే పుకార్లు వినిపించాయి. కారణాలు ఏవైనా.. అప్పట్నుంచీ రవితేజ పలు కథలు విన్నారు. కానీ, ఒక్క కథ కూడా ఓకే చేయలేదు.

తాజా సమాచారం ఏంటంటే... అనిల్ రావిపూడి చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజే నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి గత సినిమా ‘సుప్రీమ్’ను ‘దిల్’ రాజు నిర్మించారు. ఆ తర్వాత రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. అదీ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగింది. ఇప్పుడీ హీరో, దర్శకుణ్ణి ‘దిల్’ రాజు కలిపారన్నమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement