ప్రయోగానికి రెడీ అవుతున్నాడు | Raviteja taking experiment route for his next film | Sakshi
Sakshi News home page

ప్రయోగానికి రెడీ అవుతున్నాడు

Dec 19 2015 1:45 PM | Updated on Sep 3 2017 2:15 PM

ప్రయోగానికి రెడీ అవుతున్నాడు

ప్రయోగానికి రెడీ అవుతున్నాడు

మాస్ మహరాజ్ రవితేజ అంటేనే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటి వరకు తన కెరీర్ ఎక్కువగా ఆ తరహా సినిమా లే చేస్తూ వస్తున్న రవితేజ త్వరలో ఓ ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల...

మాస్ మహరాజ్ రవితేజ అంటేనే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎక్కువగా ఆ తరహా సినిమాలే చేస్తూ వస్తున్న రవితేజ త్వరలో ఓ ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న రవితేజ, నెక్ట్స్ సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న ఎవడో ఒకడు సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రభినయం చేయనున్న రవితేజ, ఒక పాత్రలో 50 ఏళ్ల వ్యక్తిగా, మరో పాత్రలో 20 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నాడట. ముందుగా 20 ఏళ్ల కుర్రాడి పాత్రను షూట్ చేయనున్నారట, అందుకోసం ఇప్పటినుంచే రెడీ అవుతున్నాడు రవితేజ. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రయోగానికి దిగుతున్న రవితేజకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement