Everest Group
-
ఫిష్ మాసాలాలో పురుగుమందులు? సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సీరియస్
ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో అనేక రకాల మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాలను విక్రయించే ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలో పరిమితికి మించి పురుగుమందులు ఉన్నట్లు గుర్తించింది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీంతో షిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నిన్న (ఏప్రిల్ 18న) ఒక ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ రీకాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మానవ వినియోగానికి పనికిరాని స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను ఉన్నట్లు గుర్తించినట్టు ఏజెన్సీ పేర్కొంది. “ఇంప్లికేట్ చేయబడిన ఉత్పత్తులు సింగపూర్‌లోకి దిగుమతి అయినందున, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఉత్పత్తులను రీకాల్ చేయమని దిగుమతిదారు, ముత్తయ్య & సన్స్‌ని ఆదేశించింది. విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం) వ్యవసాయ ఉత్పత్తులో ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం, ఆహారంలో పురుగుమందు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదమని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. ఈ మసాలా ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యంపై ఆందోళనలున్నవారు వైద్య సలహాను పొందాలనీ, ఇతర సమాచారం నిమిత్తం వారి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ ఉదంతంపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయ లేదు. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) -
ఐటీ కంపెనీలకు తాజా సవాల్ ఏంటంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఊరిస్తున్న భారీ ఒప్పందాలు.. మరోవైపు నిపుణులైన మానవ వనరుల కొరత. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల ప్రస్తుత పరిస్థితి. డీల్స్ స్థాయితో సిబ్బంది నైపుణ్యతను పోలిస్తే అసమతుల్యత ఏర్పడుతోంది. అట్రిషన్ కోవిడ్ ముందస్తు స్థాయికి 17-20 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. సిబ్బంది ఉద్యోగాలు మారుతుండడమే ఇందుకు కారణం. మహమ్మారి నేపథ్యంలో ఆధునీకరణ, డిజిటల్ వైపు మార్కెట్ దూసుకెళ్తుండడంతో కంపెనీల వ్యయాలు పెరిగాయి. కోవిడ్ కారణంగా మందగించిన డిమాండ్‌ను అందుకోవడానికి సంస్థలు మరింత విస్తరిస్తున్నాయి. దీంతో డిజిటల్ నైపుణ్యాలు ఉన్న మానవ వనరుల కొరత యూఎస్, ఈయూతోపాటు ఇటీవల భారత్‌లోనూ చూస్తున్నట్టు రిసర్చ్ కంపెనీ ఎవరెస్ట్ గ్రూప్ చెబుతోంది. నిపుణుల వేట మొదలైంది.. కోవిడ్ సమయంలో సేవా సంస్థలు ఫ్రెషర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల కోతల కారణంగా కొరత మరింత తీవ్రంగా మారింది. అయితే ఉద్యోగులకు నైపుణ్య శిక్షణపై ఐటీ కంపెనీలు ఇప్పటికే దృష్టిసారించాయి. సిబ్బందిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వేట మొదలు పెట్టాయి. రానున్న రోజుల్లో డిజిటల్ నైపుణ్యాలతోపాటు ఇతర విభాగాల్లోనూ కొరత ఏర్పడుతుందని ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో పీటర్ బెండోర్ సామ్యూల్ తెలిపారు. కొద్ది రోజుల్లో డిజిటల్ విభాగంలో అట్రిషన్ 7–8 శాతం ఉండొచ్చని టీమ్‌లీజ్ అంటోంది. నియామకాలు 15–16 శాతముంటాయని జోస్యం చెబుతోంది. భారీ డీల్స్ చేతుల్లోకి రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా నిపుణులు ఉండడం కంపెనీల పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి: అక్టోబరు నుంచి నియామకాలు పెరిగాయి. రిక్రూట్మెంట్ అంత క్రితంతో పోలిస్తే తక్కువే. ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రం గతంలో లేనంతగా ఉంది. అయితే ఇది స్థిరమైన విధానం కాదని అందరూ గుర్తించారని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్త వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు వ్యాపారం తిరిగి పుంజుకుంటుండడంతో ప్రస్తుత, రాబోయే ప్రాజెక్టుల కోసం ప్రతి కంపెనీ నియామకాలను చేపట్టాలని చూస్తున్నాయి. దీంతో నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడతాయి. ప్రధానంగా డిజిటల్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. డిజిటల్ నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ ఉంది. ఉత్తమ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మార్చి త్రైమాసికంలో అట్రిషన్ పెరుగుతుంది’ అని వివరించారు. గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ ఉన్న 500 మందిని రెండేళ్లలో నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. నైపుణ్యం పొందేందుకు మార్కెట్లో వనరులు ఉన్నాయని ఎడ్వెన్సాఫ్ట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి రామ్మూర్తి రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిదేనని అన్నారు. బలమైన వృద్ధి వైపు మార్కెట్: ఐటీ సేవల కంపెనీల 3వ త్రైమాసికం ఫలితాలతో తక్కువ వృద్ధి నుంచి రికవరీ అయిన సంకేతాలు కనపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో తదితర సంస్థలు పెద్ద డీల్స్‌ను అందుకునే పనిలో ఉన్నాయి. యాక్సెంచర్ గణాంకాలు, ముందున్న డీల్స్ వెరశి 2021–22లో బలమైన వృద్ధి ఉండొచ్చని మార్కెట్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాల పెంపుపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. 2021–22 సంవత్సరా నికి వేతనాలు పెంపును ఇప్పటికే టీసీఎస్ ప్రకటించింది. ఆరు నెలల్లో ఇది రెండవసారి కావడం గమనార్హం. ఉత్తమ పనితీరు కనబరిచేవారు సంస్థలో కొనసాగేలా కాగ్నిజెంట్ ప్రత్యేక బోనస్ ఇస్తోంది. ఒక వారం వేతనానికి సమానమైన బోనస్‌ను యాక్సెంచర్ ఆఫర్ చేసింది. -
దక్షిణాదిపై దృష్టిసారించిన ఎవరెస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూఫింగ్, సీలింగ్, వాల్, ఫ్లోరింగ్ వంటి ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సొల్యుషన్స్ కంపెనీ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించింది. నిర్మాణ సామగ్రి ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని ఇదింకా కొలిక్కి రాలేదని ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఎండీ మనీష్ సంఘీ తెలిపారు. శుక్రవారమిక్కడ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ విభాగమైన స్టీల్ బిల్డింగ్ సొల్యుషన్స్ ప్రెసిడెంట్ మనీష్ గారాగ్æతో దేశంలోనే తొలిసారిగా ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ (పీఈబీ) టెక్నికల్ మాన్యువల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పీఈబీ పరిశ్రమ రూ.5 వేల కోట్లుగా ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఈసారి 20 శాతం వృద్ధిని లకి‡్ష్యంచామని తెలిపారు. గత ఐదేళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 50 లక్షల చ.అ.ల్లో పీఈబీ నిర్మాణాలను పూర్తి చేశామని.. ప్రస్తుతం మథర్సన్ సుమీ, సుందరం మోటార్స్, బ్రిటానియా, రిలయెన్స్ వంటి ఇతర కంపెనీల ప్లాంట్ల నిర్మాణ ప్రాజెక్ట్ ఆర్డర్లున్నాయని తెలిపారు. పీఈబీ నిర్మాణాలు త్వరిగతిన పూర్తవుతాయని, నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. -
టీసీఎస్సే మళ్లీ టాప్: ఎవరెస్ట్ గ్రూప్
లండన్: దేశీ దిగ్గజ ఐటీ సర్వీసెస్ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్)... వరసగా మూడో ఏడాది కూడా గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘ఎవరెస్ట్ గ్రూప్’ నివేదికలో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఎవరెస్ట్ గ్రూప్.. ‘ఇండిపెండెంట్ టెస్టింగ్ సర్వీసెస్-మార్కెట్ ట్రెండ్స్’ పేరుతో ఒక నివేదికను రూపొందించింది. ఇందులో టీసీఎస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆటోమేషన్ వంటి నెక్ట్స్ జనరేషన్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు పెట్టడం, ప్రొడక్ట్ ఆధారిత పరిశ్రమ ప్రత్యేకమైన సేవలతో టెస్టింగ్ సర్వీసెస్‌లో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉండటం కారణంగా టీసీఎస్ నివేదికలో అగ్రస్థానాన్ని పొందిందని ఎవరెస్ట్ గ్రూప్ వివరించింది. ఇండిపెండెంట్ టెస్టింగ్ సేవలకు సంబంధించిన అన్ని రకాల అంశాల్లోనూ టీసీఎస్ ఇతర 22 కంపెనీల కన్నా ఎక్కువ మార్కులను సొంతం చేసుకుందని పేర్కొంది.