టీసీఎస్సే మళ్లీ టాప్: ఎవరెస్ట్ గ్రూప్ | TCS recognised as leader by Everest Group report | Sakshi
Sakshi News home page

టీసీఎస్సే మళ్లీ టాప్: ఎవరెస్ట్ గ్రూప్

Published Wed, Jul 20 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

టీసీఎస్సే మళ్లీ టాప్: ఎవరెస్ట్ గ్రూప్

టీసీఎస్సే మళ్లీ టాప్: ఎవరెస్ట్ గ్రూప్

లండన్: దేశీ దిగ్గజ ఐటీ సర్వీసెస్ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్)... వరసగా మూడో ఏడాది  కూడా గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘ఎవరెస్ట్ గ్రూప్’ నివేదికలో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఎవరెస్ట్ గ్రూప్.. ‘ఇండిపెండెంట్ టెస్టింగ్ సర్వీసెస్-మార్కెట్ ట్రెండ్స్’ పేరుతో ఒక నివేదికను రూపొందించింది. ఇందులో టీసీఎస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఆటోమేషన్ వంటి నెక్ట్స్ జనరేషన్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు పెట్టడం, ప్రొడక్ట్ ఆధారిత పరిశ్రమ ప్రత్యేకమైన సేవలతో టెస్టింగ్ సర్వీసెస్‌లో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉండటం కారణంగా టీసీఎస్ నివేదికలో అగ్రస్థానాన్ని పొందిందని ఎవరెస్ట్ గ్రూప్ వివరించింది. ఇండిపెండెంట్ టెస్టింగ్ సేవలకు సంబంధించిన అన్ని రకాల అంశాల్లోనూ టీసీఎస్ ఇతర 22 కంపెనీల కన్నా ఎక్కువ మార్కులను సొంతం చేసుకుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement