Everest Height
-
ఓవైపు విషాదం...మరోవైపు సెల్ఫీలు
కఠ్మాండు: ఎక్కడికెళ్లినా సెల్ఫీ(స్వీయ చిత్రం)లు క్లిక్ చేసుకోవడం, ఫేస్బుక్, ట్వీటర్ వంటి సైట్లలో పోస్ట్ చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది. ఓవైపు విషాదం చివరికి కఠ్మాండులో భూకంపం వల్ల కుప్పకూలిన చారిత్రక ధారాహర టవర్ వద్ద కూడా ఇప్పుడు సెల్ఫీల గోల మొదలయింది. విషాదమే అయినా.. చారిత్రక సాక్ష్యం అంటూ అక్కడికి వచ్చిన వారంతా శిథిలాలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ చర్య విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు గూడు చెదిరి, కూడు, గుడ్డతో పాటు గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటే నవ్వుతూ సెల్ఫీలు తీసుకోవసం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
కఠ్మాండు కదిలినా.. ఎవరెస్టు తగ్గలే
సిడ్నీ: నేపాల్లో భారీ భూకంపం సంభవించి అక్కడి కఠ్మాండు నగరం మూడు మీటర్లు పక్కకు జరిగినా దానికి పక్కనే ఉండి భూకంప ప్రభావానికి గురైన ఎవరెస్టు పర్వతం ఎత్తు మాత్రం ఏమాత్రం తగ్గలేదని, చెక్కు చెదరకుండా ఉందని ఆస్ట్రేలియా పర్వత నిపుణులు తెలిపారు. 80 ఏళ్లలోనే అత్యంత పెను భీభత్సంగా మారి రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నేపాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీనివల్ల భారీ భవనాలన్ని కూడా మొదలు నరికినా చెట్ల మాదిరిగా పడిపోయాయి. హిమాలయ పర్వతాల్లో మంచు కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ భూకంపంపై ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్లేషణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరెస్టు శిఖరాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియన్ నిపుణులు దాని ఎత్తు తగ్గిపోలేదని నిర్ధారించారు. అయితే, ఇది శాటిలైట్ ఆధారంగా వచ్చిన డేటా మాత్రమేనని, కొద్ది రోజులు ఆగితేగానీ అసలు విషయం తెలియబోదని వివరించారు.