పరీక్ష కేంద్రాల గుర్తింపునకు సీబీఎస్ఈ యాప్
న్యూఢిల్లీ: పరీక్షలు సమీస్తున్న వేళ విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను గుర్తించడానికి సాయం చేసేలా సీబీఎస్ఈ ఓ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ‘ఎగ్జామ్ లొకేటర్’గా పిలిచే ఈ యాప్ రోల్‌నంబర్ ఆధారంగా విద్యార్థి తన పరీక్ష కేంద్రం ఎక్కడో సులువుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ యాప్ ద్వారా విద్యార్థి... పరీక్ష కేంద్రం చిరునామా, చిత్రాలు, జియోలొకేషన్లను సులువుగా గుర్తించి, అక్కడికి ఎలా చేరాలో తెలుసుకుంటాడని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు మొబైల్ నంబర్ ద్వారా నమోదుచేసుకుంటే వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దీని ద్వారా విద్యార్థి యాప్‌లోకి లాగిన్ కావాలి.