‘కంట్రోల్-సి’ టై
‘కంట్రోల్- సి’ అంటే కాపీ అని అర్థం. మరి దీనికి 2011 సెప్టెంబరు 9న జరిగిన దాడులకు లింకేంటి? అనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘కంట్రోల్-సి’. అశోక్, దిశాపాండే జంటగా సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మిస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే హైదరాబాద్లో ఎమ్.ఎమ్. కీరవాణి ఆవిష్కరించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, చిత్ర కథానాయిక దిశా పాండే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీధర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.