Explosives seized
-
అంబానీ ఇంటి వద్ద కలకలం కేసు: సచిన్ వాజేకు షాక్
ముంబై: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ వాజే ఇక మాజీ పోలీస్ అధికారిగా మారిపోయాడు. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తూ ముంబై పోలీస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన అతడిని తాజాగా మంగళవారం పోలీస్ శాఖ నుంచి పంపించేశారు. పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా సచిన్ వాజే పేరు ప్రఖ్యాతులు పొందారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల నిలిపి ఉన్న కేసు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలతో పట్టుబడిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే.. ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా శాఖపరమైన చర్యలు ముంబై పోలీసులు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనే సమాచారంతో శుక్రవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున విస్పోటకాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిల్వ ఉంచిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
గోల్పారా: మేఘాలయలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో గోల్పారా జిల్లాలోని ఓ గ్రామంలో ఇవి పోలీసుల కంటపడ్డాయి. ఇటీవల పోలీసులకు పట్టుబడిన ఉల్ఫా కేడర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు చెప్పిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఇవి లభించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం 52 జిలెటిన్స్, 182 డిటోనేటర్స్, కొన్ని మీటర్ల ఫ్యూజ్ వైరు లభించింది. ఇటీవల ఉల్ఫాకు చెందిన లాంబు అసోం, హరినాథ్ రభా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా ఈ బాంబుల వివరాలు తెలిశాయి.