పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం
Published Fri, Oct 21 2016 11:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనే సమాచారంతో శుక్రవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున విస్పోటకాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిల్వ ఉంచిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement