ఎయిర్‌సెల్ నుంచి ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఆపరేటర్, ఎయిర్‌సెల్ కంపెనీ ‘ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్’ను అందిస్తోంది. టెక్నాలజీ భాగస్వామి ఎంకార్బన్తో కలిసి ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్‌లో భాగంగా మొబైల్ వినియోగదారుల బ్యాలెన్స్ రూ.10 కంటే తక్కువకు పడిపోయినప్పుడు రూ.10 తక్షణ రుణం పొందవచ్చని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ పేర్కొన్నారు.
వినియోగదారులు ూ414ుకు గానీ, 12880కు గానీ డయల్ చేయాలని లేదా ఎల్ఓఏఎన్ అని టైప్ చేసి 55414కు ఎస్ఎంఎస్ చేసి ఈ ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్‌ను పొందవచ్చని వివరించారు. వినియోగదారులు తర్వాత రీచార్జ్ చేసుకున్నప్పుడు కొంత రుసుముతో కలుపుకొని ఈ రూ.10ను తగ్గిస్తామని పేర్కొన్నారు. కనీసం 180 రోజలు పాటు తమ సర్వీసును వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు ఈ ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్‌ను పొందడానికి అర్హులని వివరించారు.