ఇద్దరిని పొట్టనబెట్టుకున్న అనుమానం
వేర్వేరు ఘటనల్లో మహిళల దారుణహత్య
రోకలిబండతో ఒకరు..గొడ్డెలితో నరికి
మరొకరు..బొల్లారం, అండూర్ గ్రామాల్లో ఘటనలు
జిన్నారం : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు హ త్యకు గురయ్యారు. వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారన్న అనుమానంతో భర్తలు అంత్యంత పాశవికంగా భార్యల ను హత్య చేశారు. ఈ సంఘటనలు శుక్రవారం మండలంలో సంచలనం రేపా యి. వివరాలు ఇలా ఉన్నాయి. రేగోడు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెం దిన సంగమేశ్వర్కు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన అశ్విని (22)తో రెండేళ్ల క్రితం వివాహం జరి గింది. అయితే ఏడాది క్రితం ఎల్లారెడ్డి దంపతులు బతుకుదెరువు నిమిత్తం జిన్నారం మండలం బొల్లారం గ్రామానికి వలస వచ్చి ఇక్కడి కేబీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండ గా.. భార్య అశ్విని వివాహేతర సంబం ధం కలిగి ఉందని అనుమానంతో భర్త సంగమేశ్వర్ తరచూ వేధించేవాడు. ఇదే విషయమై శుక్రవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగిం ది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సంగమేశ్వర్ భార్య అశ్విని తలపై రోకలి బండతో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. బొల్లారం ఎస్ఐ ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని సంగమేశ్వర్ను అదుపులోకి తీసుకున్నా రు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఆయన వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు.
అండూర్లో మరో వివాహిత
వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన సంఘటన మండలంలోని అండూర్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. జిన్నారం ఎస్ఐ పాలవెల్లి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలం చిన్నకంజర్ల గ్రామానికి చెందిన సాయిలు, సిరిమని శోభ (35) దంపతులు కొంత కాలంగా మండలంలోని అండూర్ గ్రామానికి వలస వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి తేజ, లిఖిత ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదిలా ఉండగా.. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోందని అనుమానిస్తూ తరచూ సాయిలు భార్య శోభను వేధించేవాడు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో భర్త సాయిలు ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో అనుమానం పెనుభూతమైంది. దీంతో ఇంట్లోకి వచ్చిన సాయిలు భార్య శోభ తలపై గొడ్డలితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డాగ్, క్లూస్ టీంలు వివరాలను సేకరించారు. ఈ ఘటన అనంతరం సాయిలును అదుపులోకి తీసుకుని మృతురాలి అన్న వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.