కూలిన ఎఫ్-18 విమానం.. పైలట్ మృతి
లండన్: ఇంగ్లండ్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-18 యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన పైలట్ తేజ్ శరీణ్ (34) మరణించారు.
ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు శరీణ్ విమానంలో నుంచి బయటకు దూకినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. శరీణ్ కాలిఫోర్నియలో నివసించేవారు. 2004లో శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు.