facebook selfie
-
టెక్ షేర్లు వీక్- యూఎస్ వెనకడుగు
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం డోజోన్స్ 245 పాయింట్లు(0.9%) నీరసించి 27,657 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 38 పాయింట్లు(1.1%) క్షీణించి 3,319 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 117 పాయింట్ల(1.1%) నష్టంతో 10,793 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో వారం ఎస్అండ్పీ, నాస్డాక్ వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో వెనకడుగు వేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో గతంలో ప్రకటించిన అతిభారీ ప్యాకేజీ 2 ట్రిలియన్ డాలర్లకు కొనసాగింపుగా ప్రజలకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ప్రతిపాదనపై రిపబ్లికన్లు, డెమక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ కొత్త ప్యాకేజీపై స్పందించకపోవడం దీనికి జత కలిసినట్లు అభిప్రాయపడ్డారు. బేర్ ట్రెండ్? గత కొంత కాలంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల మొదటి నుంచీ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మార్కెట్లకు బలాన్నిస్తున్న FAAMNG స్టాక్స్‌లో ఈ వారం అమెజాన్, ఫేస్బుక్ 5 శాతంకంటే అధికంగా బలహీనపడ్డాయి. ఈ నెలలో చూస్తే ఫేస్బుక్, అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ 10 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. యాపిల్ మరింత అధికంగా 17 శాతం క్షీణించింది. ఇటీవల సాధించిన గరిష్టం నుంచి చూస్తే యాపిల్ 23 శాతం పతనమైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. మళ్లీ డౌన్.. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో వారాంతాన యాపిల్ 3.2 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం, అమెజాన్ 1.8 శాతం, మైక్రోసాఫ్ట్ 1.2 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. మోడర్నా ఇంక్ 3 శాతం, ఆస్ట్రాజెనెకా 1 శాతం చొప్పున బలపడగా.. ఫైజర్ 0.5 శాతం నీరసించింది. జాన్సన్ అండ్ జాన్సన్ 1.4 శాతం పుంజుకోగా.. షెవ్రాన్ 0.75 శాతం బలహీనపడింది. -
యువతి హత్య.. ఫేస్ బుక్ సెల్ఫీలో క్లూ
ఒట్టావా : కెనడాకు చెందిన ఓ యువతి మద్యం మత్తులో క్షణికావేశంలో స్నేహితురాలిని హత్య చేసింది. పోలీసుల కళ్లుగప్పి హత్య కేసు నుంచి తప్పించుకోవాలనుకుంది. కానీ, సామాజిక మాధ్యమం ఫేస్ బుక్‌లో సరదాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. వివరాలు.. రెండేళ్ల కిందట కెనడాలోని సస్కాట్చివాన్ ప్రావిన్స్‌లోని సస్కాటూన్ నగర శివారులోని డంప్ యార్డులో బ్రిట్నీ గార్గోల్(18) అనే యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె మెడను ఓ బెల్ట్ సహాయంతో ఉరి బిగించి చంపినట్టు పోలీసులు కనుగొన్నారు. యువతి మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు, చివరకు ఫేస్ బుక్ సహాయంతో నింధితురాలని పట్టుకున్నారు. యువతి హత్యలో మారణాయుధంగా వాడిన బెల్ట్, గార్గోల్ స్నేహితురాలు చెన్నే రోజ్ ఆంటోయిన్(21)కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి కేవలం కొద్ది గంటల ముందు బ్రిట్నీ గార్గోల్తో ఆంటోయిన్ కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలో ఆంటోయిన్ ధరించిన బెల్ట్, హత్యకు ఉపయోగించిన బెల్ట్ ఒక్కటే అని పోలీసుల విచారణలో తేలింది. 'హత్య జరిగిన రోజు రాత్రి ఇద్దరం కలిసి మద్యం సేవించాం. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. క్షణికావేశంలో నా స్నేహితురాలినే నేనే చంపా' అని ఆంటోయిన్ తన నేరాన్ని ఒప్పుకుంది. తాగిన మైకంలో ఆరోజు ఏం జరిగిందో నాకు సరిగ్గా గుర్తుకూడా లేదని పేర్కొంది. 'నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఏం చేసినా నా స్నేహితురాలిని తిరిగి తీసుకురాలేను. ఐ యామ్ వెరీ వెరీ సారీ.. ఇది జరగకుండా ఉండాల్సింది' అంటూ ఆంటోయిన్ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బ్రిట్నీ గార్గోల్ హత్య కేసులో ఆంటోయిన్ ను దోషిగా తేల్చిన కోర్టు ఏడేళ్ల కఠినకారాగార శిక్ష విధించింది. -
ఫేస్బుక్ సెల్ఫీతో బుక్కయ్యాడు!
తిరుచ్చి: భార్యకు హత్య చేసి పారిపోయిన భర్త ఏడేళ్ల తర్వాత అనుహ్యంగా పట్టుబడ్డాడు. ఫేస్బుక్ లో సెల్ఫీ పోస్టు చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మణి(45) తన భార్యతో కలిసి తమినాడులోని అరియలూర్ జిల్లా నన్నియూరులో కాపురం పెట్టాడు. మణి తరచుగా తన భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. 2009, ఆగస్టులో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోపంలో భార్య గొంతు కోశాడు. తర్వాత అక్కడి నుంచి చెన్నెకు పారిపోయాడు. కందస్వామిగా పేరు మార్చుకుని తొండియార్ పేటలో హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్నాడు. అయితే కేరళలో పనిచేస్తూ తమ కొడుకు మృతి చెందాడని పోలీసులతో మణి తల్లిదండ్రులు నమ్మబలికారు. అయితే ఫేస్బుక్ లో మణి సెల్ఫీ చూసిన అతడి బంధువు షాక్ తిన్నాడు. మరో నలుగురితో కలిసి మణి పనిచేస్తున్న హోటల్ కు వెళ్లాడు. వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారి అనుమానం నిజమైంది. మణి బతికే ఉన్నాడని నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారని అరియలూర్ డీఎస్పీ పి. ముత్తుకరప్పన్ తెలిపారు. బుధవారం అతడిని అరియలూర్ కు తరలించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు తిరుచ్చి సెంట్రల్ జైలులో ఉన్నాడు. -
ఫేస్ బుక్ సెల్ఫీ ఎంత పనిచేసింది!
మెల్ బోర్న్: గుర్రపు పందెంలో గెల్చుకున్న సొమ్మును 'ఫేస్ బుక్'లో పోగొట్టుకుంది ఓ ఆస్ట్రేలియా మహిళ. ఎఫ్ బీలో పోస్టు చేసిన సెల్ఫీయే ఆమె డబ్బు పోవడానికి కారణమైంది. అదేలాగంటే... చాంటెలె అనే మహిళ పెర్త్ అస్కట్ రేసుకోర్స్ లో మెల్న్ బోర్న్ కప్ పోటీలను వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై 20 డాలర్లు పందెం కాసింది. రేసులో గెలవడంతో ఆమెకు 825 డాలర్లు వచ్చాయి. ఆనందంతో రేసు టికెట్ తో సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అంటూ సెల్ఫీకి క్యాప్షన్ కూడా పెట్టింది. 15 నిమిషాల తర్వాత పందెంలో గెలిచిన సొమ్ము కోసం నిర్వాహకులను సంప్రదించింది. అప్పటికే ఎవరో నగదు తీసుకెళ్లిపోయారని చెప్పడంతో చాంటెలె మొదట అవాక్కయింది. తర్వాత రియలైజ్ అయింది. ఫేస్ బుక్ లో తాను పోస్ట్ చేసిన సెల్ఫీలోని టికెట్ పై ఉన్న బార్ కోడ్ ను కత్తిరించి సొమ్ముకు తీసుకున్నారని తెలుసుకుంది. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎవరో ఈ పని చేసివుంటారని చాంటెలె పేర్కొంది. 'నా ఫోటోతో రేసులో గెలిచిన మొత్తాన్ని తెలివిగా కాజేశారు. నా ఫేస్ బుక్ లోని స్నేహితులే ఈ పని చేశారని నాకు తెలుసు. ప్రైజ్ మనీతో ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుదామనుకున్న నా ఆశపై నీళ్లు చల్లారు' అని చాంటెల్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.