నకిలీ కలెక్టరమ్మ అరెస్ట్
చెన్నై : ఓ నకిలీ కలెక్టరమ్మకు తమిళనాడు పోలీసులు అరదండాలు వేశారు. గత కొంతకాలంగా జిల్లా కలెక్టర్గా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువతిని (26) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే సేలంలోని ఈడపడి పట్టణంలో ఓ రహదారి విషయంలో జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి వారికి చికిత్స జరుగుతున్న ఆస్పత్రికి వెళ్లిన ఆమె...తాను జిల్లా కలెకర్ట్నంటూ ఫేక్ ఐడెంటిటీ కార్డు చూపించి.... అక్కడివారిని తన ప్రశ్నలతో హడలు కొట్టింది. ఈ సందర్భంగా అక్కడ వైద్యులతో అపాయం ఉందంటూ ఫిర్యాదు చేసింది. దాంతో ఆస్పత్రికి వర్గాలకు ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో నకిలీ కలెక్టరమ్మ బండారం బయటపడింది. కలెక్టర్గా చెప్పుకుంటూ ఆ యువతి పలువురిని మోసగించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలి భర్త ఓ ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు.