500 నకిలీ ఈవీఎంలు పట్టివేత
తంజావూరు : తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూర్లో ఫ్లయింగ్ స్వాడ్ సిబ్బంది 500 నకిలీ ఈవీఎంలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి తిరువరూర్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.