breaking news
fake liquor case
-
నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ డెన్ నుంచి రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యింది నకిలీ మద్యమేనని తేలింది. సేకరించిన గుంటూరు ప్రయోగశాలకు పంపగా.. ఫలితాలను చూసి ఎక్సైజ్ అధికారులే కంగుతిన్నట్లు తెలుస్తోంది.మొత్తం 45 శాంపిల్స్‌ను పంపగా.. అన్నీ నకిలీ మద్యమేనని తేలింది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండా తయారైన ఈ లిక్కర్‌ను రాష్ట్రవ్యాప్తంగా బార్లు, వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా చేశారనే షాకింగ్ విషయం వెలుగు చూసింది. అలాగే నిందితుల కస్టడీ రిపోర్టులోనూ కీలక వివరాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు దగ్గరుండి మరీ నకిలీ మద్యం తయారు చేసినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉందని కూలీలకు నమ్మబలికి.. ఈ దందాను యధేచ్చగా నడిపించినట్లు తెలుస్తోంది. -
ఏపీలో అద్దేపల్లి జనార్దనరావు డంప్ వద్ద స్వాధీనం చేసుకున్నది నకిలీ మద్యమే... ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు
-
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే
సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్‌పై వరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి.. వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వాస్తవాలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ప్ల కార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. భావ ప్రకటన హక్కుకు విఘాతం కల్పించవద్దని, ప్రజలంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాక్షి హైదరాబాద్ కార్యాలయంలో ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో రోజుల తరబడి వేధించడం ఎంత మాత్రం భావ్యం కాదని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లా.. సాక్షి ఎడిటర్‌పై కేసు సిగ్గు సిగ్గు.. నియంత ప్రభుత్వం సిగ్గు సిగ్గు.. జర్నలిస్టుల గొంతునొక్కే దౌర్జన్య పాలన నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి తెస్తుంటే సహంచలేని స్థితిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవల సాక్షి ఎడిటర్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు, ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో హైదరాబాద్ కార్యాలయానికి వెళ్లి వేధించడం చాలా దారుణం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా వార్తలో తప్పు ఉంటే ఖండన ఇవ్వాలి. లేదంటే లీగల్ నోటీసు ఇవ్వాలి. కానీ, పోలీసు కేసులు నమోదు చేయడం ఎక్కడా లేదు. ఇది సరైన విధానం కాదు.– సీహెచ్ రమణారెడ్డి, సామ్నా రాష్ట్రప్రధాన కార్యదర్శిబెదిరింపు ధోరణి మానుకోవాలి జర్నలిస్టులపై కేసులు పెట్టి, కార్యాలయాలకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడే ధోరణి మానుకోవాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం మనకు కల్పించిన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ బట్టబయలైన నేపథ్యంలో వార్తలు రాస్తే కేసులు పెట్టడం దుర్మార్గ చర్య. సమాజం మేలు కోసమే జర్నలిస్టులు పని చేస్తుంటారు. అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – ఎం.రామకృష్ణ, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి‘సాక్షి’ని వేధించేందుకే తప్పుడు కేసులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాక్షిని లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ‘సాక్షి’ మీడియా గ్రూప్ మీద ఒత్తిడి పెంచేందుకు, వాస్తవాలు రాయకుండా, ప్రసారం చేయకుండా కట్టడి చేసేందుకు కేసులు బనాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం అంశంపై ప్రచురితమైన కథనాలకు సంబంధించి సోర్స్ వెల్లడించాలని ఒత్తిడి చేయడం ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకమే తప్ప మరొకటి కాదు. – వర్దెళ్లి మురళి, సీనియర్ సంపాదకులురాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపాలిఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపైన రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛపైన జరుగుతున్న దాడి. సమాజంలో జరుగుతున్న విషయాలను మీడియా నిర్భయంగా ప్రజలకు చేరవేస్తుంది. ప్రసారం చేసిన వాటిపై అభ్యంతరముంటే ప్రభుత్వం వివరణ ఇవ్వడమో, ఖండించడమో చేయాలి. అలాకాకుండా పోలీసులను ఉసిగొల్పి నోటీసులు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు సరికావు.ఇలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలను ఏపీ ప్రభుత్వం వెంటనే ఆపేయాలి. కొంతకాలంగా ప్రభుత్వాలు మీడియాను నియంత్రించాలనే ఆలోచనలతో వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని నిలువరింపలేక వారికి అండగా ఉన్న మీడియాను ఈ విధంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు సరికాదు. మీడియా ఎంత వ్యతిరేక వార్తలు రాస్తే ప్రభుత్వానికి అంత మంచిది. తప్పులు, పొరపాట్లను సరిచేసుకునే అవకాశం ఉంటుంది.. – ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల నేత పత్రికా స్వేచ్ఛపైన దాడి పరాకాష్టకు చేరిందిసాక్షి మీడియాపైన ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దాడి పరాకాష్టకు చేరింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి మీడియాపైన పదేపదే ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఏదో ఒక అంశాన్ని ఆసరా చేసుకుని దాడులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినప్పటికీ... వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ విధంగా కక్షసాధింపులకు పాల్పడడం ఆక్షేపణీయం. ఏపీ ప్రభుత్వం, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైంది. అలాంటి మీడియా హక్కులకు విఘాతం కలిగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. – అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
Tirupati: విద్యార్థి ప్రాణం తీసిన నకిలీ మద్యం
-
Perni Nani: తాగితే చస్తారు! అన్ని మద్యం దుకాణాల్లో ఉన్నది కల్తీ లిక్కరే!
-
కల్తీ.. కల్తీ.. కల్తీ.. తాగితే చస్తారు!
-
Kannababu: కల్తీ మద్యం 99రూ.. ఎకరం భూమి 99పైసలు.. బాబుపై సెటైర్లు
-
టీడీపీ నకిలీ మద్యంపై పవన్ స్పందించపోవటానికి కారణం..
-
నకిలీ మద్యం దోపిడీకి క్యూ ఆర్ కోడ్ అడ్డమే కాదు
సాక్షి, అమరావతి : నకిలీ లిక్కర్ దందాకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై మద్యం ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చర్యగా బాటిళ్లపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తిరిగి పెడుతోందని, తద్వారా ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించినట్లే అని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.నకిలీ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగేది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలోనే కాబట్టి, నకిలీ మద్యం దోపిడీకి ‘క్యూ ఆర్ కోడ్ స్కాన్’ అడ్డమే కాదన్నారు. లూజ్ లిక్కర్ అమ్మకాలు జరిగే చోట క్యూ ఆర్ కోడ్ స్కాన్‌తో పనేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, తదితర ప్రాంతాల్లో నకిలీ లిక్కర్ దందా బయట పడినప్పుడే చుట్టుపక్కల మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయడంతో పాటు లక్షల్లో శాంపిల్స్ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేవారని చెప్పారు. కానీ అలాంటి కార్యక్రమాలేవీ జరగక పోవడం చూస్తుంటే ఈ దందా వెనుక కూటమి పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల దోపిడీ లక్ష్యం ‘కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల భారీ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టురట్టయినా, దాని వెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. మద్యం అమ్మకాల్లో 70 శాతం చీప్ లిక్కరే. అందువల్ల చీప్ లిక్కర్ ప్లేసులో అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కూటమి పెద్దలు భారీ ఆదాయ వనరుగా మార్చుకున్నారు.నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ ఉద్యమం చేయడంతో మద్యం బాటిళ్లపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ పేరుతో హడావుడి చేస్తోంది. అయితే మద్యం తాగే వారిలో చాలా మంది రోజువారీ కూలీలు. నిరక్షరాస్యులు. వారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. అలాంటప్పుడు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్ సరుకు అనేది ఎలా తెలుస్తుంది? షాపులన్నీ టీడీపీ నేతలవే అయినప్పుడు వారెందుకు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను పట్టిస్తారు? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని పోతిన మహేష్ నిలదీశారు.గత ప్రభుత్వంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం విక్రయం జరిగేదని, నాడు ప్రభుత్వ ఆ«దీనంలో పారదర్శకంగా లిక్కర్ అమ్మకాలు జరిగాయని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే నకిలీ లిక్కర్ దొంగలను శిక్షించాలన్నారు. లూజ్ లిక్కర్‌కు క్యూ ఆర్ కోడ్ స్కాన్ ఎలా? ‘పర్మిట్ రూమ్‌లతో నకిలీ మద్యం అమ్మకాలు పెరుగుతాయా, తగ్గుతాయా? అక్కడ లూజ్ లిక్కర్‌కు క్యూర్ కోడ్ స్కాన్ అవకాశం ఉంటుందా? గత ప్రభుత్వంలో గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ ఇçప్పుడు నోరెత్తరేం’ అని పోతిన ప్రశ్నించారు. -
సాక్షి ఆఫీస్ లో హై డ్రామా!
-
మద్యం అక్రమ కేసు బెయిల్ పిటిషన్లపై ACB కోర్టు విచారణ
-
Tirupathi: నకిలీ మద్యానికి యువకుడు బలి
-
TDP నేత జనార్ధన్ కు చెందిన వైన్ షాపులో తనిఖీలు
-
సిట్ మాటున చంద్రం చిల్లర కుట్రలు
-
Big Question: మెడ చుట్టూ బిగుస్తున్న పాపాలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
-
Peddireddy: దమ్ముంటే.. సీబీఐకి అప్పగించు..!
-
మద్యం అక్రమ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం
-
జోగి రమేష్ పై ఆరోపణలు.. సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబు డైరెక్షన్‌తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి ‘జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్‌లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్‌లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్‌కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. -
ఈ ప్రశ్నలకు జవాబేది?
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ మద్యం రాకెట్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విషయం బట్టబయలు కావడంతో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు.. ఇద్దరూ కలిసిపోయి సాగిస్తున్న నాటకాలు, కుతంత్రాలే అసలు కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అందరి చూపులు.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతున్న నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం కరువైంది. నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా కింది ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ⇒ ఏ1 జనార్దన్‌రావును అరెస్టు చేసి విచారించిన తరువాతే న్యాయ స్థానంలో హాజరు పరిచారు. పోలీసులు తమ విచారణలో వెల్లడైన విషయాలతో రిమాండ్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ రిమాండ్ నివేదికలో ఎక్కడా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావించనే లేదు. జనార్దన్‌రావుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్దన్‌రావు వీడియో బయటకు రావడం వెనుక దాగిన గుట్టు ఏమిటి? నిజంగా జోగి రమేష్ పేరును ఆయన చెప్పి ఉంటే ఆ విషయాన్ని న్యాయ స్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలోనే వెల్లడించే వారు కదా! మరి ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ⇒ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గోడౌన్లో సోదాలు చేసి జప్తు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వమే చేయించిందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ జనార్దన్‌రావుతో చెప్పించిన వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా ఎందుకు ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యాన్ని తెప్పించి.. అనంతరం ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించారని జనార్దన్‌రావుతో ఎందుకు చెప్పించారు? నకిలీ మద్యం దందాలో టీడీపీ పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకే ఈ కట్టు కథలతో అడ్డంగా దొరికారన్నది నిజం కాదా? ⇒ విదేశాలకు వెళ్లిపోతే తనకు రూ.3 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆఫర్ ఇచ్చారంటూ ఏ1 జనార్దన్‌రావుతో ప్రభుత్వ పెద్దలు వీడియో ద్వారా చెప్పించారు. మరి అంతలోనే ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు? తన తమ్ముడిని పట్టించుకోవడం లేదని మరో కట్టు కథ ఎందుకు చెబుతున్నారు? అంటే జోగి రమేష్ రూ.3 కోట్లు ఇస్తానన్నట్లు వీడియోలో ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమే కదా.. ఈ లెక్కన ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఆయన రాష్ట్రానికి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం కాదా? ⇒ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోనే పోలీసులు కస్టడీలో విచారించేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. మరి ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఎందుకు భావించడం లేదు? ⇒ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావును విదేశాల నుంచి రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు రాష్ట్రానికి రప్పించడం లేదు? లుక్ అవుట్ నోటీసు జారీలో తాత్సారం ఎందుకు? ఆయన అరెస్టుకు ఎందుకు యత్నించడం లేదు? ⇒ అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం యూనిట్ నుంచి నకిలీ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేసినట్టు వెల్లడైంది. ఆ వ్యానులు టీడీపీ నేతలవే. ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఆ వాహనాలు ఎవరివి అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటిని జప్తు చేయకుండా పోలీసులను అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు? ⇒ నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో దాదాపు 75 వేల బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదు? బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు? దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు ఎందుకు పంపడం లేదు? ⇒ రాష్ట్రంలో అసలు నకిలీ మద్యమే లేదని.. మద్యం దుకాణాల్లో నకిలీ సరుకు అమ్మడమే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి అంతలోనే ఎందుకు ‘ఏపీ ఎక్సైజ్ యాప్’ను ప్రవేశ పెట్టారు? నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఆ యాప్‌పై అవగాహన కల్పించాలని ఎందుకు చెబుతున్నారు? అంటే టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అధికారికంగా అంగీకరించినట్లే కదా? ⇒ టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు, బార్లలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని యతి్నస్తున్నట్లు కాదా? ⇒ నకిలీ మద్యం దందాతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే డైవర్షన్ డ్రామాలు ఎందుకు? ఏ1 జనార్దనరావుతో గుర్తు తెలియని ప్రదేశంలో ఓ వీడియో షూట్ చేయించడం ఎందుకు? కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఆ వీడియో గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ వీడియో డ్రామా బెడిసి కొట్టగానే.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసంలో సిట్ సోదాలతో హడావుడి ఎందుకు? ఇవన్నీ ఈ కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావా? -
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత ఇంట్లో పోలీసుల సోదాలు
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు , అతని సోదరుడు జగన్మోహనరావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. జనార్ధన్,జగన్మోహనరావు కుటుంబాన్ని విచారించిన పోలీసులు. జనార్ధనరావు ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడిగినట్టు సమాచారం. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. జనార్ధనరావు రిమాండ్ లో ఉండగా కుటుంబ సభ్యులను పోలీసులు విచారించడం పై పలు సందేహాలు వెలువడుతున్నాయి.ఎక్సైజ్ అధికారులు ఆయనను గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. జనార్ధనరావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే, ముందస్తు సమాచారం ఆధారంగా ఎక్సైజ్ బృందాలు జనార్ధనరావును పట్టుకున్నారు.విచారణలో జనార్ధనరావు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మరిన్ని నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది -
‘చంద్రబాబుకు ఎప్పటికీ మంచి బుద్ది రాదని అర్ధమైంది’
సాక్షి,తాడేపల్లి :సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దొరకగానే జోగి రమేష్ వెళ్లి ఇది నారావారి సారా అని మాట్లాడారు. దీంతో అతనిపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు.జోగి రమేష్ ఉన్నట్టు జనార్థన్‌రావుతో చందమామ కథ అల్లించారు.అందుకే ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ధిరాదని అర్ధమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యం కేసును సీబిఐకి అప్పగించాలి. చంద్రబాబుకు మంచి బుద్ది ఎప్పటికీ రాదని అర్ధమైంది.లైడిటెక్టర్ పరీక్షకు జోగి రమేష్ సిద్దమని సవాల్ చేసినా స్పందన లేదు. రెండున్నర నెలల నుండి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులే చెప్పారు. కానీ రెండు మూడేళ్లుగా తయారవుతున్నట్టు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం మీద మా వాళ్లు ఒక్క పోస్టు పెడితేనే కేసులు పెడుతున్నారు. ఒక్క ఫ్లెక్సీ కట్టాలన్నా బెదిరిస్తున్నారు. అలాంటిది మా వాళ్లు ఏకంగా నకిలీ మద్యం కుటీర పరిశ్రమను పెట్టగలరా?నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు.అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదు. ఆ కేసును మిగతా పార్టీల మీదకే రుద్దుతే టీడీపీకే నష్టం. మా హయాంలో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. దానికి తగిన ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్టులు చూపించగలరా?. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం దొరికితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు చేసేది బురద చల్లుడు రాజకీయమే. కట్టుకథలతో ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిశారు. కస్టడిలో ఉన్న జనార్ధన్ వీడియో ఎలా బయటకు వచ్చింది?. ఎవరు రికార్డు చేశారు?.సిట్ విచారణ చేస్తుందా? వీడియో లీకులు ఇస్తుందా?. ఎంపీ మిథున్‌రెడ్డితోపాటు కీలక నేతల మీద వేధింపులు ఊహించిందే. ఒక్కొక్కరి మీద పది కేసులైనా పెడతారు.అన్నిటినీ ఎదుర్కోవటానికి మేము సిద్దంగానే ఉన్నాం’అని స్పష్టం చేశారు. -
Fake Liquor Case: జోగిరమేష్ ఉగ్రరూపం.. బాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్
-
‘చంద్రబాబూ.. కృష్ణా జిల్లా నా అడ్డా.. నేను ఇక్కడే ఉంటా’
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్‌రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్‌కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు. ‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జనార్ధన్‌తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా -
‘నకిలీ మద్యం కేసులో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’
తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం మరోసారి తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌ను బయటకు తీసిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల సహకారంతో టీడీపీ నేతలు నకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఈ బురదను వైఎస్సార్సీపీకి అంటించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్థన్‌రావుతో ఒక వీడియోను తీయించి, దానిలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పిండంతో ఈ కుట్ర బయటపడిందని అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావు ఎలా వీడియో తీయగలడని, దానిని ఎల్లో మీడియాకు ఎలా చేర్చగలిగాడని వారు ప్రశ్నించారు. ఇంకా వారేమన్నారంటే..టీడీపీ పెద్దల కుట్రలు పరాకాష్టకు..కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి, దాన్ని ఎలాగైనా వైఎస్సార్సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్‌రావు వీడియో ఒకటి ఈ సాయంత్రం లీక్ చేశారు. నిజానికి ఆయన ఇప్పుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది? అంటే ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతోంది. ఈ కేసుపై నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, దీనిపై ‘సిట్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే, కేసును ఎలా నీరుగార్చబోతున్నారు? వైయస్సార్సీపీకి ఎలా అంటగట్టబోతున్నారు? అనేది తేటతెల్లమైంది. పైగా ఈ కేసులో లోతులోకి వెళ్లేసరికి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయన్న చంద్రబాబు మాట.. ఆయన కుట్రను బయట పెట్టింది. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే, కేసులో ప్రధాన నిందితుడైన జనార్థన్ రావు నోటి నుంచి వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు పలికించి, ఆయన్ను ఈ కేసులో ఇరికించే పని మొదలు పెట్టారు. నిజానికి నకిలీ మద్యం తయారు చేస్తున్న, ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు జనార్థన్ రావు, జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు.. స్వయంగా చంద్రబాబు, నారా లోకేష్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అంటే వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నారు. కాబట్టే అంత పెద్ద రాకెట్ నడిపించారు. ఇంకా చెప్పాలంటే.. ముందు నుంచి మా పార్టీ చెబుతున్నట్లు ప్రభుత్వ, పార్టీ పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది, ఇది వాస్తవం. ఇదంతా టీడీపీ ప్రభుత్వం వచ్చాక, మొదలైన దందా. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని పట్టించడమే జోగి రమేష్ చేసిన నేరమా? ఆఫ్రికా నుంచి దర్జాగా పిక్నిక్ నుంచి తిరిగి వచ్చినట్లు జనార్థన్‌రావు రావడం.. అంతకు రెండు, మూడు రోజుల ముందు ఒక వీడియో రిలీజ్ చేసి, నకిలీ మద్యం తయారీలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడం.. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగింది. ఆఫ్రికా నుంచి దర్జాగా వచ్చిన జనార్థన్‌రావును గన్నవరం విమానాశ్రయం నుంచే ఎక్సైజ్ అధికారులు ఎక్కడికో తరలించారు. ఏం చెప్పాలో, ఎవరిపై నింద వేయాలో.. అన్నీ ఒక పథకం ప్రకారం ఆయన్ను ప్రిపేర్ చేశారు.వైఎస్సార్సీపీ ఆందోళనలతో కంగారుపడ్డ చంద్రబాబురాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైయస్సార్సీపీ ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడంతో భయపడిన, చంద్రబాబు నిన్న రాత్రి హడావిడిగా ప్రెస్‌మీట్ పెట్టి, చాలా విషయాలు మాట్లాడి, ఈ కేసులో వైయస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పినట్లు ఆరోపించి, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ హ్యాండెడ్‌గా అన్ని ఆధారాలతో దొరికినా, నకిలీ మద్యం తయారీ ఈ స్థాయిలో జరుగుతున్నా.. అందులో ప్రభుత్వ, పార్టీ పెద్దల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిందను వైయస్సార్సీపీపై వేయడం అత్యంత దారుణం హేయం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? భారత రాజ్యాంగ పరిధిలో ఈ రాష్ట్రం లేదా? ఇంత కంటే నిర్లజ్జగా అధికార దుర్వినియోగం ఎక్కడైనా ఉంటుందా? ఇవి దర్యాప్తు సంస్థలా? లేక చందమామ కధలు చెబుతున్నారా? బేతాళ కథలు అల్లడంలో సిద్ధహస్తులయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత దగుల్బాజీ వ్యవస్థ లేదు. చంద్రబాబు మాదిరిగా వ్యవస్థలను ఎవరూ నాశనం చేయడం లేదు. చట్టం, న్యాయం, కోర్ట్లు అంటే ఏ మాత్రం గౌరవం లేదు. రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న నకిలీ మద్యం తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్థన్, సురేంద్రనాయుడు తదితరులపై కేసు నమోదు చేశారు. ఒక పథకం ప్రకారం ముందుగా మాట్లాడుకున్న తరువాత జనార్థన్ నాయుడిని దక్షిణాఫ్రికా నుంచి ఏపీకి రప్పించారు. ఎంత దర్జాగా ఆయన విదేశాల నుంచి ఏపీకి వచ్చారో కూడా ప్రజలు చూశారు. ఆ తరువాత ఒక కుట్రపూరితంగా ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియోతో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్కయ్యింది. జనార్థన్‌ను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన కోర్ట్ కు రిమాండ్‌కు పెట్టారు. ఈ రోజు విడుదల చేసిన వీడియోలో 'నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌కు సంబంధం ఉందని, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబుకు చెడ్డపేరు రావాలని, తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి, ఊరూరా ఆ మద్యాన్ని సరఫరా చేయాలి' అని జోగి రమేష్ చెప్పినట్లుగా ఆ వీడియోలో చూపించారు. మొలకలచెరువులో ఈ వ్యవహారం బయటపడిన తరువాత దాని డిపో ఇబ్రహీంపట్నంలో బయటపడింది. దీనిని కూడా తమకు అనుకూలంగా చేసుకుని మాజీ మంత్రి జోగి రమేష్ సలహా మేరకే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డిపోను ఏర్పాటు చేశారని, మొలకలచెరువు మద్యం తయారీ బయటపడిన వెంటనే, జోగి రమేష్ ఇబ్రహీంపట్నం లోని డిపో గురించిన సమాచారంను ఒక పథకం ప్రకారం లీక్ చేయించారంటూ జనార్థన్‌తో చెప్పించిన వీడియోను బయటకు విడుదల చేశారు. ఈ వీడియో గురించి పూర్తి వాస్తవాలు బయటపెట్టాలి. సిట్ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఎల్లో మీడియా ఈ వీడియోను ఎలా విడుదల చేసిందో చెప్పాలని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. -
కాకినాడ రూరల్‌లో కన్నబాబు ఆధ్వర్యంలో ఆందోళన
-
అంతా మనోళ్లే..! సిట్ తో సరిపెట్టేద్దాం.. నిజం ఒప్పుకున్నా బాబు!
-
అద్దేపల్లి ఫోన్ అదృశ్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో కరకట్ట బంగ్లా డైరెక్షన్‌తో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావుకు టీడీపీ పెద్దలతో లింకులు ఉన్నట్లు బహిర్గతం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయోనని ముఖ్యనేతలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ తరహాలో విస్తరించిన నేపథ్యంలో జనార్దనరావు నోరు తిప్పితే తమ కొంప కొల్లేరు అవుతుందని ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారు.నకిలీ మద్యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగారు. జనార్దనరావు తమ డైరెక్షన్లో లొంగిపోయేలా డ్రామాకు తెర తీశారు. ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారంలో కరకట్ట బంగ్లాకు నెల వారీగా రూ.కోట్లాది ముడుపులు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావు ఫోన్ తాజాగా అదృశ్యమైంది. జనార్దనరావును అరెస్టు చేసిన తరువాత ఫోన్ గురించి పోలీసులు ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని చెప్పినట్లు కట్టుకథ అల్లారు. లొంగిపోయే వరకు టచ్‌లోనే..! అద్దేపల్లె జనార్దనరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తరువాత రాష్ట్రంలో పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేశారు. అందులో వెల్లడైన విషయాలను వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారు. దీనినిబట్టి కరకట్ట బంగ్లాతో పాటు పలువురు టీడీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. జనార్దనరావు ఫోన్ దొరికితే పలువురు టీడీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులు, ఫోన్ సంభాషణలు వెలుగు చూస్తాయని ముందు జాగ్రత్తగా మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే వరకు టీడీపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే కేసును నీరుగార్చే కుట్రలకు పదును పెట్టినట్లు సమాచారం. విదేశాలకు వెళ్లే సమయంలో మైలవరం ప్రజాప్రతినిధి బావ మరిదికి అద్దేపల్లి జనార్దనరావు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎల్లో ముఠా స్కేచ్ .. A1 జనార్దన్ రావు ఫోన్ మిస్
-
తవ్వేకొద్ది బయటపడుతోన్న టీడీపీ నేతల నకిలీ లిక్కర్ బాగోతం..A1 జనార్ధన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
-
నకిలీ మాఫియాకు ముఖ్యనేత దన్ను!
సాక్షి, అమరావతి: అనుకున్నట్టుగానే నకిలీ మద్యం మాఫియా దందాను గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నారు. ఈ దందాను అద్దేపల్లి జనార్దన్ వరకే పరిమితం చేసి, దర్యాప్తును పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, ‘నకిలీ మద్యం దందా వెనుక సూత్రధారుల గుట్టు రట్టు చేస్తాం’ అన్న ములకలచెరువు గ్యాంగ్ బెదిరింపులకు ముఖ్యనేత భయపడ్డారన్నది తేటతెల్లమవుతోంది. నకిలీ మద్యం దందా అంతా ఒక్క జనార్దన్ మాత్రమే చేసినట్టుగా తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, అలాగే కీలక నాయకుడు సురేంద్రనాయుడుతో తనకు లిక్కర్ వ్యాపార సంబంధాలు ఉన్నాయని జనార్దన్ తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు, అసలు వీరికి ఈ దందాలో భాగం ఉన్నట్లు అర్థం వచ్చేలా అందులో ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. జయచంద్రారెడ్డి పేరు నిందితునిగా చేరిస్తే, ఆయన వెనుక ఉన్న ముఖ్యనేత పేర్లు బయటకు వస్తాయని, ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ నేతల పేర్లు బట్టబయలవుతాయన్న భయంతో ఈ ఎత్తుగడ వేశారు. మద్యం దుకాణాల వ్యాపారంలో లాభాలు రావడం లేదని 2025 జూన్ తర్వాత జనార్దన్‌తో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు చేతులు కలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం ఏమిటంటే.. ఈ మాఫియాకు మూలం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు.జనార్దన్ వారి అనుచరుడు మాత్రమే. 2024 ఎన్నికలకు ముందే నకిలీ మద్యం దందా కోసం ముఖ్యనేతతో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు డీల్ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌ను మాత్రమే నకిలీ మద్యం నిర్వాహకునిగా పేర్కొనడం ముఖ్యనేత కుట్రకు నిదర్శనం.తద్వారా మాఫియాకు మూలమైన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడులను పూర్తిగా తప్పించాలన్నదే ముఖ్యనేత ఎత్తుగడ. పైగా అద్దేపల్లి ఈ ఏడాది జూన్‌లోనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్టు సూచించడం విడ్డూరం. మొత్తంగా నకిలీ మద్యం దందా తీవ్రతను తగ్గించి అంతిమ లబ్ధిదారులకు కొమ్ముకాయడమే రిమాండ్ రిపోర్ట్ లక్ష్యమని అర్థమవుతోంది. -
నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు శనివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అయిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్ చేసి తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా, ఏడు రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి చెందిన స్కారి్పయో వాహనంలో సయ్యద్ కలీం అష్రఫ్ నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్‌కు రిమాండ్రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడిగాందీనగర్ (విజయవాడసెంట్రల్): నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌కు ఈనెల 17వరకు విజయవాడలోని 6వ ఏజేఎం ఫస్ట్ క్లాస్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పరిచారు. కోర్డు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్‌ను నెల్లూరు జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతోపాటు కట్టా సురేంద్ర నాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్‌షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్రవైన్స్ తానే నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకలచెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్నార్ బార్‌తోపాటు శ్రీనివాస వైన్స్‌లో విక్రయించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లో ఈ–7 అనే బార్లో పార్టనర్‌గా చేరి అక్కడ చీప్ లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్‌తో గోవా వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్‌లో ఉన్న బాలాజీతో చేతులు కలిపి అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాప్‌లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చి, తయారీ తర్వాత బార్లో విక్రయించాడు.నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్‌ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్‌ను ఉపయోగించి తన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లిక్కర్ వ్యాపారం ఉన్న ట్లు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ముఖ్యనేత యత్నించడం గమనార్హం. -
‘సాక్షి’పై మరో రెండు అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై అనేక అక్రమ కేసులు పెట్టించింది. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది.నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది. నకిలీ మద్యంపై ‘సాక్షి’ రాసిన కథనాలు తమ శాఖ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కలిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ జలీల్, నెల్లూరు–1 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ బాబు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వెంటనే పోలీసు అధికారులు ‘సాక్షి’ పత్రిక యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జిల్లా బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్లపై 353(2), 356(3) ఆర్/డబ్ల్యూ 3(5)బీఎన్ఎస్ కింద అక్రమ కేసులు నమోదు చేశారు. రిపోర్టర్ ఇంట్లో ‘ఎక్సైజ్’ సోదాలు అంతేకాకుండా కలిగిరి ‘సాక్షి’ రిపోర్టర్ ఆర్.రాజగోపాల్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి విలేకరి ఇంటికి వెళ్లారు. ‘రాజా అంటే నువ్వేనా? అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారని నీపై ఫిర్యాదులు అందాయి. మీ ఇంట్లో తనిఖీలు చేయాలి’ అని చెప్పారు. ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేశారు. ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో వెనుదిరిగారు. ఎక్సైజ్ సిబ్బంది ఓవర్ యాక్షన్‌తో రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా.. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని శనివారం నెల్లూరు ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జికి నెల్లూరు రూరల్ పోలీసులు బీఎన్ఎస్ 179(1) నోటీసు అందజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి కూడా నోటీసులు అందజేసేందుకు పోలీసులు హైదరాబాద్‌కు వెళ్తున్నట్టు సమాచారం. -
నకిలీ మద్యం కేసు: జనార్థన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
విజయవాడ: నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్‌రావును అక్టోబర్ 17వ తేదీ వరకూ రిమాండ్ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. లిక్కర్ బిజినెస్‌లో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిపారు టిడిపి నాయకుడు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 2025 జూన్ నుంచి ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం తయారీ జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.తెలంగాణలోని హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్‌ను తీసుకొని ఏఎన్ఆర్ బార్ లో జనార్ధన్ రావు అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో E-7 అనే బార్ లో పార్టనర్ గా చేరిన జనార్ధన్ రావు.. అక్కడ చీప్ లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్‌తో గోవా కి వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్‌లో కలిసి ఉన్న బాలాజీ తో చేతులు కలిపారు. బాలాజీ ద్వారా స్పిరిట్, హీల్స్, క్యాప్‌లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్ఆర్ బార్లో విక్రయించారు. ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు.. ఫేక్ లేబుల్స్, లిక్కర్ బాటిల్స్ శ్రీనివాస్, రమేష్ అనే ఇద్దరు సప్లయ్ చేసిన విషయం వెల్లడైంది. నకిలీ మద్యం తయారు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఇబ్రహీం పట్నంకి స్పిరిట్ తరలించేవారు. జనార్ధన్‌రావు సోదరుడు జగన్మోహనరావు ద్వారా నకిలి బ్రాండ్లను తయారు చేశారు.జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్..అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకలచెరువు కల్తీ మద్యం కేసులోఎక్సైజ్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్‌ను అరెస్టు చేశారు. అష్రఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో ఏ 21 నిందితుడుగా ఉన్న అష్రఫ్.. నకిలీ మద్యాన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు గ్రామాలకు తరలించినట్లు గుర్తించారు.రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అష్రప్ బయటపెట్టినట్లు సమాచారం. టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్ఫియో వాహనంలో నకిలీ మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. మరొకవైపు టిడిపి నేతలు జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది కోసం పోలీసుల బెంగళూరులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: పక్కావ్యూహం ప్రకారమే..! -
కల్తీ లిక్కర్ కేసులో బాబుకు బిగుస్తున్న ఉచ్చు
-
Fake Liquor Case: పోలీసుల అదుపులో A1 జనార్దన్ రావు.. భయం గుప్పిట్లో కరకట్ట పెద్దలు
-
లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్
-
నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జనార్ధన్‌రావు అరెస్ట్
సాక్షి,విజయవాడ: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 కింగ్ పిన్, టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్‌రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకి వచ్చిన జనార్ధన్ రావును గన్నవరం ఎయిర్ పోర్టులో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో గత నెల 24న ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఇదీ కూడా చదవండి:‘చంద్రబాబు కుయ్ కుయ్ అనడం లేదు ఎందుకో?’ -
నకిలీ మద్యం ముడుపులు కరకట్ట బంగ్లాకు..
-
నకిలీ మద్యం తయారీలో బెంగళూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి కీలక పాత్ర
-
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్‌కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
టీడీపీ నేతల ఇండస్ట్రీలపై విచారణ.. బయటపడ్డ సంచలన నిజాలు
-
ఏపీలో నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు
-
అంతా కల్తీ మద్యం.. టీడీపీ నేత బార్ సీజ్..
-
Magazine Story: నకిలీ మద్యం.. కోట్ల డీల్.. నాయుడు అరెస్ట్..
-
పోలీస్ స్టేషన్ లో కల్తీ మద్యం కింగ్ టీడీపీ నేత సురేంద్ర నాయుడు
-
Magazine Story: బాబు కుట్ర భగ్నం.. బయటపడ్డ బండారం
-
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్
-
Liquor Case: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు.. కొండల్‌రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొండల్‌రెడ్డితో పాటు మరో ప్రధాన నిందితుడు బాలరాజ్‌గౌడ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ కోసం ఇబ్రహీంపట్నంకు తరలిస్తున్నారు. ఆ మధ్య జరిగిన నల్లగొండ మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ.. నకిలీ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. డిసెంబర్ 16వ తేదీన ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి.. అస్వస్థతకు గురైన విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఆపై ఈ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఐబీ, ఓసీ లాంటి బ్రాండ్లకు నకిలీ లిక్కర్‌ను ఒడిషా తయారు చేస్తున్నారు. వాటిని తెలంగాణ శివారు ప్రాంతాలకు తరలించి.. రంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారానికి గతంలో పాతిక మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ స్కామ్‌లో వీళ్లిద్దరి పాత్ర, లింకులపై ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు తేల్చాల్సి ఉంది. -
కేసు.. తుస్సు
‘డీల్’ కుదిరింది సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఊహించినట్లుగానే జరిగింది. రూ.4కోట్ల డీల్‌కు అనుగుణంగా నకిలీ మద్యం కేసు నీరుగారిపోతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్‌ను కేసు నుంచి తప్పించేశారు. ఆయన ప్రమేయమే లేదంటూ కేసును మూసివేసేందుకు ఎక్సైజ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ‘సాక్షి’ ముందు నుంచి చెబుతున్నట్లు ఆయన వ్యక్తిగత ప్రైవేట్ సహాయకుడు(పర్సనల్ ప్రైవేట్ అసిస్టెంట్) చిక్కా నాగశేఖరప్ప అలియాస్ రాజశేఖర్‌ను బలిపశువు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా కేసులో కీలకపాత్ర పోషిస్తున్న ‘మౌర్య-ఇన్-హోటల్’లో సమావేశానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ లేదని కేసును నీరుగార్యే ప్రయత్నం మొదలైంది. ఏకంగా జెడ్పీ చైర్మన్‌పై రాజకీయ కక్షలో భాగంగానే కేసు బనాయించారనే కోణంలో కేసును మలుపు తిప్పే ప్రయత్నం ముమ్మరమైంది. మొత్తం మీద జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు కాస్తా ఎక్సైజ్ పోలీసులు విచారణ పేరిట తుస్సుమనిపించారు. చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు డోన్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో నవంబర్ 2న 15,360 బాటిళ్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఏమైనా జరిగితే... నేను చూసుకుంటానని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ ‘మౌర్య-ఇన్ హోటల్’ సమావేశంలో చెప్పాడని ఈ కేసులోని ఏ-2, ఏ-3లుగా ఉన్న రామన్‌గౌడ్, ఉమా మహేశ్వరగౌడ్‌లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్‌ను ఆయన పీఏ రాజశేఖర్ పరిచయం చేయించారని కూడా వారు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పీఏపై ఏ-4 కేసును పోలీసులు నమోదు చేశారు. అందులో భాగంగా జెడ్పీ చైర్మన్ పీఏను డోన్ మండలం ఉడుములపాడు గ్రామసమీపంలో నవంబర్ 15న అరెస్టు చేశారు. ‘సాక్షి’ ముందు చెప్పినట్టుగానే ఆయన పీఏను బలిపశువు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ మేరకు జెడ్పీ చైర్మన్‌కు సంబంధం లేదని పీఏతోనే చెప్పించారు. ‘జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ చిన్ననాటి స్నేహితుల్లో ఒకరు. ఆయనకు కేసుతో సంబంధం లేదు. ఏ-2, ఏ-3లుగా ఈడిగ ఉమామహేశ్వర్ గౌడ్, ఈడిగ మనోహర్‌లను మౌర్య-ఇన్ హోటల్లో కలిశాం. నకిలీ మద్యం వ్యాపారం గురించి చర్చించుకున్నాం’ అని విచారణలో పీఏ తెలిపారు. మొదట్లో ఏ-2, ఏ-3లు చెప్పినట్టుగానే మొత్తం కేసులో మౌర్య-ఇన్ హోటల్ సమావేశమే కేంద్ర బింధువు. ఇంతటి కీలకమైన ‘మౌర్య-ఇన్ హోటల్’లో సీసీ టీవీ ఫుటేజీని చూస్తే... సమావేశం జరిగిన రోజు జెడ్పీ చైర్మన్ వచ్చారా? లేదా? ఇట్టే తెలిసిపోతుంది. అయితే, ఇక్కడే రాజకీయం, రూ.4 కోట్ల డీల్ మంత్రాంగం కాస్తా పనిచేసి... సీసీ టీవీ ఫుటేజీని లేకుండా చేసింది. రాజకీయ కక్షతోనే ఆరోపణలంటూ మళ్లింపు నకిలీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన జెడ్పీ చైర్మన్‌ను తప్పించేందుకు ఫుటేజీ లేదంటున్న అధికారులు... చివరకు అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు రాజకీయ కక్షతోనే చైర్మన్‌పై ఆరోపణలు చేశారంటూ మొత్తం కేసును మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా కేసుకు కాస్తా రాజకీయ రంగు పులిమి మమ అనిపించాలనే కుట్ర జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అధికారపార్టీ ఒత్తిళ్లు, రూ.4 కోట్ల డీల్‌తో... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మద్యం వ్యవహారం కథ కాస్తా కంచికి చేరనుంది.